twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Crazy Fellow Movie Review ఫన్, ఎమోషన్స్‌తో క్రేజీ ఫెల్లో.. ఆదిసాయికుమార్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.75/5

    హిట్స్, ఫ్లాప్స్‌ను బేరీజు వేసుకోకుండా ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే యువ హీరోల్లో ఆది సాయికుమార్ ఒకరు. డిఫరెంట్ జోనర్స్‌తో నటుడిగా, ఫెర్ఫార్మర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మాణ సారథ్యంలో ఆది సాయికుమార్ నటించిన క్రేజీ ఫెలో చిత్రం అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? ఆది సాయికుమార్ ప్రేక్షకులను మెప్పించాడా? రాధామోహన్ ఖాతాలో మరో విజయం చేరిందా? అనే విషయాల్లోకి వెళితే..

    క్రేజీ ఫెలో సినిమా కథ ఇలా..

    క్రేజీ ఫెలో సినిమా కథ ఇలా..

    జీవితానికి ఓ లక్ష్యం, బాధ్యత లేకుండా సరదాగా లైఫ్‌ను కొనసాగించే యువకుడు అభిరామ్ (ఆది సాయికుమార్). తన వదిన బలవంతం మీద అన్నయ్య స్నేహితుడు (సప్తగిరి) కంపెనీలో ఉద్యోగానికి చేరుతాడు. తను చేరిన ఆఫీసులో పనిచేసే మధుమిత అలియాస్ చిన్ని (దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడుతుంది. కానీ వారి మధ్య రిలేషన్ ఉప్పు, నిప్పులా ఉంటుంది. అయితే స్నేహితుడు రమేష్ (నర్రా శ్రీనివాస్) బలవంతం మేరకు డేటింగ్ యాప్‌లో చిన్నితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంటాడు. అయితే డేటింగ్ చాలా రోజులు కొనసాగిన తర్వాత ఒకరోజు చిన్ని (దిగంగన)ను కలుసుకొనేందుకు వెళ్లి అదే పేరుతో అక్కడికి వచ్చిన చిన్ని (మిర్నా మీనన్)కు ఐ లవ్ యూ చెబుతాడు.

    క్రేజీ ఫెలో సినిమాలో ట్విస్టులు

    క్రేజీ ఫెలో సినిమాలో ట్విస్టులు


    డేటింగ్ యాప్‌లో నాని పేరుతో అభిరామ్ ఎందుకు చిన్నితో ఎందుకు డేటింగ్ చేశాడు? మధుమితే చిన్ని అని తెలియకుండా చేసిన డేటింగ్ ఎలాంటి సమస్యలు తీసుకొచ్చింది? చిన్ని పేరుతో హోటల్‌లో ఎదురుపడిన యువతికి ఐ లవ్ యూ చెబితే అభిరామ్‌కు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? ఇద్దరు చిన్నిలతో ప్రేమ వ్యవహారం ఎలాంటి సమస్యలు సృష్టించింది? ఇంతకు ఏ చిన్ని ప్రేమను అభిరామ్ అంగీకరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే క్రేజీ ఫెలో సినిమా కథ.

    ఫస్టాఫ్‌లో  ఫన్, ఎమోషన్స్

    ఫస్టాఫ్‌లో ఫన్, ఎమోషన్స్

    తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోవడంతో అన్నా, వదినల వద్ద గారాభంగా పెరుగడం, ముందుచూపు, ఫిల్టర్లు లేకుండా మాట్లాడుతుండటం వల్ల స్నేహితులు, ఫ్యామిలీ ఇరకాటంలో పడటం లాంటి అంశాలతో క్రేజీ ఫెలో మూవీ ఫన్‌గా, ఎమోషనల్‌గా మొదలవుతుంది. పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్, కథను ఓ కొలిక్కి తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయమే దర్శకుడు తీసుకున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కామెడీతో సాగుతున్న కొంత బోర్ కట్టించినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో డేటింగ్ యాప్ వ్యవహారంతో అసలు కథ మొదలవ్వడం కొంత ఉపశమనంగా మారుతుంది... చిన్నిగా మిర్నా మీనన్ ఎంట్రీ ట్విస్టుతో ఫస్టాఫ్‌ ముగియడమే కాకుండా.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

    సెకండాఫ్‌లో లవ్ ట్రాక్, డ్రామా

    సెకండాఫ్‌లో లవ్ ట్రాక్, డ్రామా

    సెకండాఫ్‌లో రెండు చిన్ని పాత్రల మధ్య అభిరామ్ నలిగిపోయే డ్రామా ఆసక్తిగా కొనసాగుతుంది. మిర్నా మీనన్‌తో లవ్ ట్రాక్ ఫన్నీగా ఉంటుంది. సెకండాఫ్‌లో నర్రా శ్రీనివాస్ సపోర్టింగ్ రోల్‌తో కొంత కామెడీ జనరేట్ కావడంతో సినిమా ఫన్ రైడ్‌గా అనిపిస్తంది. చివర్లో 'చిన్ని' పాత్ర చుట్టు ఉన్న కాన్‌ఫ్లిక్ట్‌ను దర్శకుడు డీల్ చేసిన విధానంతో సినిమా ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది. అయితే కథలో కొత్తదనం, కథనంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం రొటీన్‌గా అనిపిస్తుంది.

    ఆది ఫెర్ఫార్మెన్స్, గెటప్

    ఆది ఫెర్ఫార్మెన్స్, గెటప్

    ఆది కుమార్ లవర్‌ బాయ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకొన్నారు. అభిరామ్‌గా మేకోవర్, లుక్స్‌ బాగుండటంతో ఆది చాలా ఫ్రెష్‌గా కనిపించాడు. అభిరామ్ క్యారెక్టర్‌లో ఉండే వేరియేషన్స్‌, ఎమోషన్స్‌ను స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేశాడు. ఎప్పటి మాదిరిగానే డ్యాన్స్‌, ఫైట్స్‌తో ఇరుగదీశాడు. ఆది ఫెర్ఫార్మెన్స్ కొత్తగా ఉంది. ఇటీవల ఆది చేసిన సినిమాల్లో క్రేజీ ఫెలో డిఫరెంట్ మూవీ అని చెప్పవచ్చు.

    హీరోయిన్ల గ్లామర్, ఫెర్ఫార్మెన్స్

    హీరోయిన్ల గ్లామర్, ఫెర్ఫార్మెన్స్

    ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే.. మధుమతిగా దిగంగన సూర్యవంశీ గ్లామరపరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొన్నది. చిన్నిగా మిర్నామీనన్ బబ్లీగా, క్యూట్‌గా కనిపించింది. ఇద్దరు హీరోయిన్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకు నర్రా శ్రీనివాస్ కామెడీ, హ్యుమర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆది వదినగా నటించిన వినోదిని వైద్యనాథన్ ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకొన్నాడు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫి బాగుంది. కలర్ ప్యాటర్న్, లైటింగ్ పలు సన్నివేశాలు స్క్రీన్ మీద రిచ్‌గా కనిపించాయి. డీఐ వర్క్ బాగుంది. సతీష్ ముత్యాల మ్యూజిక్ ఫీల్‌ను క్రియేట్ చేసింది. ఫస్టాఫ్‌లో రెండు పాటలు క్రేజీగా ఉన్నాయి. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాగుంది. ఫీల్ గుడ్ పాయింట్‌తో కేకే రాధామోహన్ అందించిన క్రేజీ ఫెలో మూవీలో నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రలకు తగినట్టు ఆర్టిస్టులను ఎంచుకోవడం సినిమాను మరింత ఫీల్‌ను క్రియేట్ చేసింది. తొలి చిత్ర దర్శకుడైనా ఫణి కృష్ణ ఎక్కడ తడబాటు పడకుండా అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించాడు.

    ఫైనల్‌గా క్రేజీ ఫెలో

    ఫైనల్‌గా క్రేజీ ఫెలో


    లవ్, ఎమోషన్స్, ఫన్, హ్యుమర్, మంచి మ్యూజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అంశాలతో రూపొందిన చిత్రం క్రేజీ ఫెలో. ఆది సాయికుమార్ ఫెర్ఫార్మెన్స్, హీరోయిన్ల గ్లామర్, సాంకేతిక విలువలు ఈ సినిమాకు హెలెట్. ఫస్టాఫ్‌లో కొంత, సెకండాఫ్‌లో కొంత స్లో కథ సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. వారాంతంలో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగిన క్లీన్ ఫ్యామిలీ డ్రామా.

    క్రేజీ ఫెలోలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    క్రేజీ ఫెలోలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా, సప్తగిరి, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, నర్రా శ్రీనివాస్ తదితరులు
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఫణికృష్ణ
    నిర్మాత: కేకే రాధమోహన్
    మ్యూజిక్: ఆర్ఆర్ ధ్రువన్
    సినిమాటోగ్రఫి: సతీష్ ముత్యాల
    ఎడిటర్: సత్య గిడుతూరి
    రిలీజ్: 2022-10-14

    English summary
    Actor Aadi Saikumara and Producer KK Radha Mohan's Crazy Fellow movie hits the screen on October 14th. Here is the Telugu Filmibeat's exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X