For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డిటెక్టివ్ మూవీ రివ్యూ: విశాల్ అడ్వెంచర్ డ్రామా

  By Rajababu
  |

  Rating:
  2.5/5
  Star Cast: విశాల్, అండ్రియా జెర్మియా, అను ఇమ్మాన్యుయేల్, ప్రసన్న
  Director: మిస్కిన్

  "Detective" Movie Public Talk "డిటెక్టివ్" పబ్లిక్ టాక్

  తెలుగులో మంచు మనోజ్ నటించిన రాజుభాయ్ అనే చిత్రానికి కథను అందించిన తమిళ దర్శకుడు మిస్కిన్, తెలుగు ప్రేక్షకులకు పందెం కోడి లాంటి చిత్రాలతో రుచి చూపించిన విశాల్ కలిసి రూపొందించిన చిత్రం డిటెక్టివ్. తమిళంలో ముగమూడి లాంటి సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను అందించిన తాజాగా అదే జోనర్‌తో డిటెక్టివ్ చిత్రాన్నిరూపొందించారు. ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆర్థర్ కోనన్ డోయ్లే తీర్చిదిద్దిన షెర్లాక్ హోమ్స్ పాత్ర ఈ సినిమాకు ఇన్సిపిరేషన్. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న డిటెక్టివ్ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  డిటెక్టివ్ కథ ఇలా..

  డిటెక్టివ్ కథ ఇలా..

  అద్వైత భూషణ్ (విశాల్) నిజాయితీ కూడిన ఓ ప్రైవేట్ డిటెక్టివ్. మనోహర్ (ప్రసన్న) అతని అసిస్టెంట్. కేసులు లేవని బాధపడుతున్న నేపథ్యంలో ఓ స్కూల్ విద్యార్థి తన పెంపుడు కుక్కను చంపినదెవరో తెలుసుకోవాలని అద్వైత భూషణ్‌ను కోరుతాడు. ఆ కేసు కూపీ లాగుతున్న క్రమంలో అనేక హత్యలు, నేరాలు అద్వైత భూషణ్ దృష్టికి వస్తాయి. హత్యలు చేసి వాటిని యాక్సిడెంట్స్‌గా నమ్మిస్తారు. ఆ హత్యల వెనుక డెవిల్ (వినయ్), భాగ్యరాజా, ఆండ్రియాతో కూడిన గ్యాంగ్ హస్తం ఉందని తెలుస్తుంది. వారందరూ హత్యలు ఎందుకు చేశారు. ఆ హత్యల వెనుక మిస్టరీ ఏమిటీ? ఇంకా ఈ చిత్రంలో సిమ్రాన్, అను ఇమ్యాన్యుయేల్ పాత్రలు ఏమిటనే ప్రశ్నలకు తెరపైన సమాధానమే డిటెక్టివ్ చిత్రం.

  ఫస్టాఫ్ ఈ విధంగా సాగుతుంది

  ఫస్టాఫ్ ఈ విధంగా సాగుతుంది

  కేసులు లేకుండా ఇబ్బందిపడుతున్న అద్వైత భూషణ్ అనే డిటెక్టివ్ కథతో సినిమా ప్రారంభమవుతుంది. కొన్ని కేసులు వచ్చినా నిజాయితీ లేకపోవడం వల్ల వాటిని ఒప్పుకోకపోవడం విశాల్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడం, ఆ తర్వాత స్కూల్ పిల్లాడు తన పెంపుడు కుక్క మరణం గురించిన కేసును అప్పగించడంతో సినిమా అసలు కథ ప్రారంభమవుతుంది. కేసు వెనుక చిక్కు ముడులను విప్పదిసే క్రమంలో ఒక్కొక్క నిందితుడు మృత్యువాత పడటం లాంటి సీన్లు చాలా ఆసక్తిగా ఉంటాయి. సైన్స్‌ను ఆధారంగా చేసుకొని చేసిన హత్యలు ప్రేక్షకుడి మెదడుకు మేత పెడుతాయి. అలా అనేక ట్విస్టులతో సినిమా ఫ్లాట్‌గా సాగుతూ ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

  సెకండాఫ్‌ రొటీన్‌గా

  సెకండాఫ్‌ రొటీన్‌గా

  ఇంటర్వెల్ తర్వాత డెవిల్ (వినయ్ రాయ్) ఎంట్రీ కావడంతో సీరియస్ రూపం దాల్చుతుంది. ఆ తర్వాత భాగ్యరాజా హత్య, అను ఇమ్మాన్యుయేల్ మర్డర్ చాలా హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. ఈ సన్నివేశాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లుతాయనే భ్రమ కలుగుతుంది. కానీ చిత్ర కథ రొటీన్‌గా లాజిక్కులు లేకుండా ఫ్లాట్ సాగడం ప్రీ క్లైమాక్స్ ముందు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతాయి. క్లైమాక్స్‌లో మంగళూరుకు సమీపంలోని దట్టమైన అడవుల్లో తీసిన యాక్షన్ సీన్లు కొంత ఆసక్తికరంగా ఉన్నాయని అనిపించినా ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువదు. ఎందుకంటే చాలా రొటీన్‌గా క్లైమాక్స్ ముగియడంతో ప్రేక్షకుడు కొత్తదనం ఏమీ కనిపించదు.

  మిస్కిన్ విజన్.

  మిస్కిన్ విజన్.

  హాలీవుడ్‌లో షెర్లాక్ హోమ్స్ పాత్రలను స్ఫూర్తి పొంది దర్శకుడు మిస్కిన్ రాసుకొన్న కథ తమిళ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంది. కానీ మేకింగ్, స్క్రీన్ ప్లేలో అతను అనుసరించిన తీరు బీ, సీ క్యాటగిరీల ఆడియెన్స్‌కు సంతృప్తి కలిగించేలా లేకపోవడం ఈ సినిమా విజయానికి పెద్ద అవరోధమని చెప్పవచ్చు. ఛేజింగ్, మర్డర్ ప్లాన్స్ సామాన్య ప్రేక్షకుడికి థ్రిల్ కలిగిస్తాయి. సైన్స్, టెక్నాలజీ అంశాలను స్క్రిప్టులో జొప్పించిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతాయి.

  డిఫరెంట్‌గా విశాల్

  డిఫరెంట్‌గా విశాల్

  కమర్షియల్ సినిమాల్లో ఇప్పటివరకు విజృంభించిన విశాల్‌కు ఇది డిఫరెంట్ చిత్రం. ఈ చిత్రంలో లుక్ పరంగా, నటనపరంగా విశాల్‌లో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. డిటెక్టివ్ పాత్ర కోసం విశాల్ చేసిన కసరత్తు తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. డిటెక్టివ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అనే రేంజ్‌లో విశాల్ ఫెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కానీ కథలో దమ్ము లేకపోవడం విశాల్ శ్రమ అంత బూడిదలో పోసిన పన్నీరైపోయిందా అనే సందేహం కలుగుతుంది.

  అను ఇమ్మాన్యుయేల్ నటన

  అను ఇమ్మాన్యుయేల్ నటన

  ఇక డిటెక్టివ్ చిత్రంలో మల్లిక పాత్రలో ఓ జేబుదొంగగా అను ఇమ్మాన్యుయేల్ కనిపించింది. చిల్లర దొంగతనాలు చేసే మల్లికను పాత్ర డిటెక్టివ్ దగ్గర కావడం, ఆ తర్వాత ఒకరిపై మరొకరికి ఇష్టం కలిగే సీన్లు చాలా సున్నితంగా ఉంటాయి. చివర్లో మల్లిక పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ పలికించిన హావభావాలు ప్రేక్షకుడికి మనసుకు హత్తుకుంటాయి. తన పాత్ర పరిధి మేరకు అను ఇమ్మాన్యుయేల్ ఫర్వాలేదనిపించింది. కానీ ఈ చిత్రం ఆమెకు గొప్ప పేరు తెచ్చేలా లేకపోవడం ఆమెకు ఓ మైనస్ పాయింట్.

  నెగిటివ్ షేడ్‌లో ఆండ్రియా

  నెగిటివ్ షేడ్‌లో ఆండ్రియా

  ఆండ్రియా జెర్మియా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించింది. హంతకుల ముఠాలో ఓ సభ్యురాలిగా నటించింది. ఈ పాత్ర కోసం హార్లీ డెవిడ్సన్ బైక్‌ల మీద రైడ్ చేయడం, దట్టమైన అడవుల్లో, బురద గుంటల్లో యాక్షన్ సీన్లు చేయడం లాంటి ప్రయత్నాలు చేసింది. అయితే అండ్రియా పాత్రను సంపూర్ణంగా ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా దర్శకుడు ప్రయత్నం చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు.

  విలన్ పాత్రలో వినయ్

  విలన్ పాత్రలో వినయ్

  డెవిల్‌ పాత్రలో విలన్‌గా వినయ్ రాయ్ చాలా క్రూరంగా కనిపించాడు. విలనిజంలో తన మార్కును కనబరించేందుకు ప్రయత్నించాడు. కీలక సన్నివేశాలలో వినయ్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. చాలా సన్నివేశాల్లో ఆయన యాక్షన్ ఆకట్టుకునే విధంగా ఉంది.

  వైవిధ్యమైన పాత్రలో భాగ్యరాజా

  వైవిధ్యమైన పాత్రలో భాగ్యరాజా

  దర్శకుడు, నటుడు భాగ్యరాజా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడు. భాగ్యరాజా అని చెప్పితే తప్ప ఆయనను గుర్తు పట్టడం చాలా కష్టం. ఎందుకంటే ముసలి పాత్రలో తెల్లటి గడ్డంతో కనిపిస్తాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో భాగ్యరాజా తన మార్కు చూపించాడు. తాను హత్యకు గురైన సమయంలో స్వయంగా తన భార్యను చంపడం అనే అంశం చాలా కన్విన్స్‌గా ఉంటుంది. ఆ సీన్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది.

  ఇతర పాత్రల్లో ప్రసన్న, సిమ్రాన్

  ఇతర పాత్రల్లో ప్రసన్న, సిమ్రాన్

  విశాల్‌ అసిస్టెంటుగా, స్నేహితుడిగా ప్రసన్న నటించాడు. మిగితా పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ తదితరులు కనిపిస్తారు. ఆయా పాత్ర ధారులు వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపిస్తారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడిని వెంటాడే పాత్రలు, గుర్తుంచుకొనే పాత్రలు పెద్దగా కనిపించవు.

   బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్

  యాక్షన్, సస్పెన్స్, థ్రిలర్ చిత్రానికి సరిపడే బ్యాక్ గ్రౌండ్ స్కోరును అరోల్ కరొల్లి అందించారు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో పాటలు లేకపోవడం కూడా తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశమని చెప్పవచ్చు.

  కార్తీక్ వెంకట్రామన్ పనితీరు..

  కార్తీక్ వెంకట్రామన్ పనితీరు..

  థ్రిల్లర్, మిస్టరీ కథకు అనుగుణంగా మూడ్‌ను తన ఫొటోగ్రఫి ద్వారా క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రఫర్ కార్తీక్ వెంకట్రామన్ సఫలయ్యాడు. పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, క్లైమాక్స్ ఫైట్లు చాలా అద్భుతంగా చిత్రీకరించాడు.

  ఫైనల్ జడ్జిమెంట్

  ఫైనల్ జడ్జిమెంట్

  మర్డర్ మిస్టరీ ఆధారంగా సాగే సినిమాలో కథ నింపాదిగా సాగడం ప్రధానమైన మైనస్. కొన్ని క్యారెక్టర్లు, సన్నివేశాల విషయంలో ఎక్కడా లాజిక్ కనిపించదు. ప్రీ క్లైమాక్స్‌లో ఓ చేజింగ్ సీన్‌లో అండ్రియాను వెంటాడిన పోలీసులు, డిటెక్టివ్‌లు ఆమెను కావాలనే క్లైమాక్స్ కోసం వదిలిపెట్టనట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో విలన్, హీరోకు మధ్య సన్నివేశాలు చాలా పేలవంగా ఉంటాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం మల్టీప్లెక్స్ ఆడియెన్స్ పరిమితం అనేలా ఉంది. ఒకవేళ బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చితే మంచి ఘనవిజయాన్ని చేజిక్కించుకొనే అవకాశం ఉంటుంది.

  పాజిటివ్ పాయింట్స్

  పాజిటివ్ పాయింట్స్

  విశాల్, అండ్రియా, అను ఇతర

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  రీరికార్డింగ్

  మైనస్ పాయింట్స్

  కథ

  చిత్రం నడివి

  స్లో నేరేషన్

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: విశాల్, అండ్రియా జెర్మియా, అను ఇమ్మాన్యుయేల్, ప్రసన్న, వినయ్, భాగ్యరాజ్, సిమ్రాన్, వినయ్ రాయ్ తదితరులు

  దర్శకత్వం: మిస్కిన్

  నిర్మాత: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ

  సంగీతం: అరోల్ కొరెల్లి

  సినిమాటోగ్రఫీ: కార్తీక్ వెంకట్రామన్

  రిలీజ్: నవంబర్ 10, 2017

  నిడివి: 159 నిమిషాలు

  ప్రివ్యూ: ప్రసాద్ ల్యాబ్స్ (9 తేదీ నవంబర్ సాయంత్రం 6 గంటలకు )

  English summary
  Detective movie story written and directed by Tamil Director Mysskin. The film is produced by Vishal, who also stars in the lead role. The film also features Prasanna, Andrea Jeremiah, Vinay and Anu Emmanuel amongst other actors. This movie released on 10 November 2017. The film was inspired by Sir Arthur Conan Doyle's detective character, Sherlock Holmes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X