twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సస్పెన్స్ లేదు కానీ కామెడీతో...(గీతాంజలి’ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    హైదరాబాద్: రొటీన్ తెలుగు చిత్రాలకు భిన్నంగా హారర్ అండ్ కామెడీ కలగలిపిన సినిమాలు ఈ మధ్య బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన 'కాంచన', కొన్ని రోజుల క్రితం వచ్చిన 'ప్రేమ కథాచిత్రమ్' సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ అయ్యాయి. అదే తరహా మసాలాతో తాజాగా 'గీతాంజలి' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈచిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా ఎంవివి సత్యనారాయణ నిర్మించారు. రచయిత కోన వెంకట్ సినిమా స్క్రిప్టుకు తన వంతు మసాలా అందించారు. ఆయన సమర్పణలోనే ఈ సినిమా విడుదలయింది. మరి సినిమా విశేషాలేమిటో ఓ లుక్కేద్దాం...

    కథలోకి వెళితే...సినిమా దర్శకుడు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంటాడు శ్రీనివాసరెడ్డి. దిల్ రాజుకు కథ చెప్పి ఎలాగైన అవకాశం దక్కించుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో స్మశానం పక్కన ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటారు. శ్రీనివాసరెడ్డితో పాటు సత్యం, రాజేష్, జబర్దస్త్ శంకర్ కూడా అదే ఇంట్లో దిగుతారు. గతంలో ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి(అంజలి) దయ్యంగా మారి తిరుగూ ఉంటుంది. మరి దయ్యం కారణంగా వారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి తన లక్ష్య సాధనకు ఏం చేసాడు? అనేది థియేటర్లో చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...సినిమా టైటిల్ రోల్ చేసిన అంజలి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పెర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అంజలి తర్వాత శ్రీనివాసరెడ్డి సినిమాలో కీలకమైన పాత్ర పోషించాడు. పెర్ఫార్మెన్స్ పరంగా ఒకే అనిపించుకున్నాడు. సైతాన్ రాజ్ పాత్రలో బ్రహ్మానందం అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టెన్ చేసారు. సత్యం రాజేష్, జబర్దస్త్ శంకర్ కామెడీ ఆకట్టుకునే విధంగా ఉంది. రావు రమేష్ కీలకమైన పాత్రలో తనదైన నటన కనబరిచాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు. దిల్ రాజు తొలిసారిగా ఈ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో తెరపై కనిపించారు.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు


    టెక్నిల్ అంశాల పరంగా పరిశీలిస్తే.... హారర్ కథాంశాల్లో కీలకమైన భూమిక ఫోషించే సినిమాటోగ్రఫీ విభాగాన్ని సాయి శ్రీరామ్ చక్కగా హాండిల్ చేసాడు. ఇలాంటి సినిమాలకు కీలకం అయిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంలో లక్కరాజు ప్రవీణ్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఉపేంద్ర ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇతర టెక్నికల్ విభాగాలు కూడా బాగా పని చేసాయి.

    దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్

    దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్


    కొత్తవాడు అయినప్పటికీ దర్శకుడు రాజ్ కిరణ్ పనితీరు బాగుంది. కోన వెంకట్ అందించిన డైలాగులు, స్క్రీన్ ప్లే మరో సారి తనదైన ముద్ర వేసారు. సినిమాకు ఆయన అందించిన డైలాగులు, స్క్రీన్ ప్లే కీలకంగా మారాయి. ఒక రకంగా కోన వెంకట్ సినిమా మొత్తాన్ని దగ్గరుండి చూసుకున్నారని చెప్పొచ్చారు.

    ప్లస్, మైనస్

    ప్లస్, మైనస్


    ఇక సినిమాలోని ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే.... కథ, స్క్రీప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. మొటి భాగం వినోదంతో నిండి పోవడంతో కథ వేగంగా సాగింది. కామెడీ కూడా బాగుంది. ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే రెండో భాగంలో మెయిన్ స్టోరీ సాగే సమయంలో కథనం మందగించింది. హారర్ సినిమా అనే పేరేగానీ సస్పెన్స్, థ్రిల్ అనే అంశాలు మైనస్ అయ్యాయి. పాటల కూడా ఆకట్టుకునే విధంగా లేవు.

    చివరగా....

    చివరగా....


    ఓవరాల్ గా చెప్పాలంటే....కామెడీతో సినిమాను నెగ్గుకొచ్చారని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలతో సినిమాలకు వెళ్లినా వినోదాత్మక అంశాలతో ప్రేక్షకులు కొంత మేరకు సంతృప్తి చెందుతారని చెప్పొచ్చు.

    English summary
    Raj Kiran's debut directorial venture Geethanjali has created lot of buzz in the media for several good reasons. Its promos - videos, posters, songs and music videos have garnered huge amount of curiosity for the film. Having soared up the viewers expectations to the sky high, the movie has hit the screens today (August 9).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X