Don't Miss!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- News
హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం: తుపాకీతో బెదరించి రూ. 2 లక్షలు దోపిడీ
- Finance
Bank Locker: బ్యాంకులో లాకర్ ఉందా..? ఈ వార్త తెలుసుకోండి.. లేకుంటే లాకర్ ఫ్రీజ్ అవుద్ది..!
- Sports
Team India : హిస్టరీ రిపీట్ అవుతుంది.. టీమిండియా మళ్లీ ఆ ఫీట్ సాధిస్తుందా?
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Leharaayi movie Review ఆకట్టుకొనే ఫాదర్ సెంటిమెంట్.. సినిమాకు అవే మైనస్?
నటీనటులు: రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, ఆలీ, వీకే నరేష్, సత్యం రాజేశ్ తదితరులు
దర్శకత్వం: రామకృష్ణ పరమహంస
నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
మ్యూజిక్ డైరెక్టర్: ఘంటాడి కృష్ణ
సినిమాటోగ్రఫి: ఎంఎన్ బాల్‌రెడ్డి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రిలీజ్ డేట్: 2022-12-09
డాక్టర్ పురుషోత్తం (రావు రమేష్)కు కూతురు మేఘన (సౌమ్య మీనన్) తన ప్రాణానికి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. తనకు తెలియకుండా కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకోదనే గట్టి నమ్మకంతో ఉంటాడు. చదువు తప్ప లవ్ లాంటి మరో విషయంపై దృష్టిపెట్టని మేఘన.. తన కాలేజీలో సహ విద్యార్థి కార్తీక్ (రంజిత్ సొమ్మి)కు ప్రపోజ్ చేయడం తండ్రి పురుషోత్తానికి షాక్ తగులుతుంది.
కార్తీక్‌కు మేఘన ఎందుకు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది? కూతురు చేసిన పనికి పురుషోత్తం ఎలా రియాక్ట్ అయ్యాడు. మేఘన ప్రపోజ్ చేసిన తర్వాత కార్తీక్ ఎలా రియాక్ట్ అయ్యాడు? కార్తీక్‌పై నిజంగానే మేఘనకు ప్రేమ ఉందా? కార్తీక్, మేఘన ప్రేమను తండ్రి పురుషోత్తం అంగీకరించాడా? కార్తీక్ జీవితంలో జరిగిన చేదు సంఘటన ఏమిటి? కార్తీక్ లైఫ్‌లో జరిగిన సంఘటనతో డాక్టర్ పురుషోత్తానికి సంబంధం ఏమిటి? కాలేజీలో రౌడీ (గగన్ విహారి)ని కార్తీక్ ఎలా అడ్డుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లెహరాయి సినిమా కథ.

లెహరాయి సినిమా విషయానికి వస్తే.. తండ్రి, కూతుళ్ల మధ్య ప్రేమానురాగాలు, అలాగే అక్కా, తమ్ముడి మధ్య అనుబంధం అనే బలమైన పాయింట్స్‌తో ఈ సినిమా కథను దర్శకుడు రామకృష్ణ పరమహంస అల్లుకొన్నాడు. అయితే రెగ్యులర్ ప్యాటర్న్‌తో కాకుండా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కథను చెప్పి ఉంటే బాగుండేది. కార్తీక్, మేఘన, పురుషోత్తం, కార్తీక్ తండ్రి (వీకే నరేష్) పాత్రలను చక్కగా రాసుకొన్నారు. అయితే ఫీల్, ఎమోషన్స్ సన్నివేశాల్లో జొప్పించి ఉంటే మంచి చిత్రంగా మారి ఉండేదనిపిస్తుంది. యువ నటీనటులు, సీనియర్ నటుల మేళవింపుతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారు.
ఇక లెహరాయి సినిమాకు రావు రమేష్ వెన్నముకగా నిలిచారు. ఎమోషనల్ తండ్రి పాత్రలో రకరకాల వేరియేషన్స్ చూపించారు. కథను స్వయంగా భుజాల మీద మోసే బాధ్యతను తీసుకొన్నారు. ఇక మేఘనగా సౌమ్య మీనన్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఇక కార్తీక్‌గా రంజిత్ సొమ్మి ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. సారీ చెప్పను అనే డిఫరెంట్ మ్యానరిజంతో ఆకట్టుకొన్నాడు. బాధ్యతాయుతమైన అన్నగా, ప్రేమికుడిగా తన పాత్రకు తగిన న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక కార్తీక్ తండ్రిగా వీకే నరేష్, అలాగే కాలేజీలో రౌడీగా సాఫ్ట్ విలనిజాన్ని గగన్ విహర్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్, చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఘంటాడి కృష్ణ మరోసారి తన మార్కును చూపించాడు. ప్రేమ కథకు కావాల్సిన ఎమోషన్స్‌ను తన మ్యూజిక్‌తో పండించే ప్రయత్నం బాగుంది. ఇక ఈ సినిమాకు ఫైట్స్ కాస్త అతిగా అనిపిస్తాయి. సెన్సిబుల్ లవ్ స్టోరిలో కాస్త యాక్షన్ తగ్గించి ఉంటే.. ఆ ఫీల్ కొనసాగి ఉండేదనిపిస్తుంది. ఇక సినిమా లెంగ్త్, కొన్ని రిపీట్ షాట్స్ తగ్గించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
కూతురుపై తండ్రి ప్రేమ, అక్కపై సోదరుడి ప్రేమనురాగాలు ముఖ్య అంశాలుగా ఎమోషన్స్ ఉన్న చిత్రం లెహరాయి. అయితే సరైన సందర్భంలో కీలక సన్నివేశాల్లో భావోద్వేగాలు పండకపోవడంతో ఈ ప్రేమ కథ ఆకట్టుకొలేకపోయింది. కథ చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగిపోతుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టకపోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అతిగా యాక్షన్ ఎపిసోడ్స్, లెంగ్త్ సినిమాకు మైనస్. కీలక పాత్రలు రావు రమేష్, సౌమ్య, రంజిత్ ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తారు. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే.. మంచి ప్రేమ కథా చిత్రమై ఉండేది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. ఈ సినిమా నిరాశపరచదు.