For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్..థ్రిల్లింగ్ (నాటే ఎ లవ్ స్టోరీ రివ్యూ)

  By Srikanya
  |

  నటీనటులు: మహిగిల్,దీపిక్,అజయ్ తదితరులు
  కథ: రోహిత్
  సంగీతం: సందీప్ చౌతా
  దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
  నిర్మాతలు: సునీల్ బొహ్రా, సైలేష్ సింగ్,కిరణ్ కుమార్ కోనేరు

  రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం నాటే లవ్ స్టోరీ ఎన్నో కాంట్రావర్శీలు,కోర్టు కేసుల నడుమ విడుదలైంది.రిలీజ్ కు ముందు పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం చూసిన వారికి మాత్రం షాకింగ్ ఎక్సపీరియన్స్ ని కలగచేస్తోంది.ధ్రిల్లర్ నేరేషన్ లో చెప్పిన ఈ క్రేమ్ స్టోరీకి అద్బుతమైన టెక్నికల్ విలువలతో కళ్ళ ఎదుట జరుగుతున్న ఫీల్ తీసుకువచ్చారు వర్మ.వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న మరోసారి తానేంటో నిరూపించుకుని తన అభిమానులను రంజిపచేసాడు.

  మొదటనుంచి చెప్పుకుంటన్నట్లుగానే నీరజ్ గ్రోవర్ అనే టీవీ చానెల్ ఉద్యోగిని మరియా సుసైరాజ్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేయడాన్ని ఆధారంగా తీసుకొని వర్మ ఈ 'నాట్ ఏ లవ్ స్టోరీ"ని రూపొందించాడు.2008 లో కథ మొదలవుతుంది.ఔత్సాహక నటి అనూష్క చావ్లా(మహి గిల్)ఒంటరి. ఆమె ముంబైలోని ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం అన్నట్లు తిరుగూతూంటుంది.రకరకాలగా రిజెక్టు అవటం,కాస్టింగ్ కోచ్ వ్యవహారాలు ఆమె పట్టుదలను నీరుకారుస్తూంటాయి.ఈ లోగా ఆమెకు ఆశిష్ (అజయ్)పరిచయమై ఆమెకు ఓ రోల్ ఆఫర్ చేస్తాడు.అతను కాస్టింగ్ డైరక్టర్. ఆ తర్వాత అతనితో పరచయం ముందుకు వెళ్థుంది. ఈ లోగా ఆమె అబ్సెసిస్ లవర్ రాబిన్ (దీపక్)ఆమె ప్లాటులో దిగి ఆమె ఆ వ్యక్తితో ఉండటం గమనిస్తాడు.అప్పుడే జరిగిందనేది జాతి నివ్వెరపోయిన మిగతా కథ.

  ఇక వర్మ ఈ కథలో ప్రత్యేకత చూపింది కిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ చెప్పటంలోనే.దాంతో ఆ క్రైమ్ మొత్తం నమ్మశక్యంగా ఆ పరిస్ధితుల్లో ఎవరైనా ఉంటే అలాగే చేస్తారన్నట్లు అనిపిస్తుంది.ఆయన అధ్బుతమైన డైరక్షన్ స్కిల్స్ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ లోని కనపడి ఈ సబ్జెక్టుని ఆయన ఎంతగా ప్రేమించారో చెప్తూంటుంది.ఇక పాత్రధారులు కూడా పూర్తిగా క్యారెక్టర్స్ లోకి పరకాయప్రవేశం చేసారనిపిస్తుంది.ముఖ్యంగా కీలకమైన పాత్రలో మహిగిల్ చాలా బాగా చేసింది.కథగా చాలా చిన్న ప్లాట్ అయిన ఈ పాయింట్ ని తనదైన స్క్ర్రీన్ ప్రెజెంటేషన్ తో తెరకెక్కించారు.నిజ జీవితంలోని కొన్ని సంఘటనలను యాధాతదంగా వాడి సినిమాకు నిండుతనం తేవటం సినిమాకు ప్లస్ అయ్యింది.అలాగే వర్మ సినిమాల్లో ప్రత్యేకంగా కనపడే సౌండ్ డిజైన్ ఈ సినిమాలో మరింత ఫెరఫెక్ట్ గా కనిపిస్తుంది.కెమెరా వర్క్ కూడా చాలా న్యాచురల్ లైట్స్ తో తీసి అధ్బుతం చేసారు.ముఖ్యంగా సందీప్ చౌతా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణమై నిలిచింది.అలాగే రంగీలాలోని పాట రీమిక్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

  ఇక సత్య,రంగీళా,శివ వంటి చిత్రాల రేంజిలో లేకపోయినా ఈ చిత్రం వర్మ శైలిని మరోసారి మనముందించి ఆనందపరుస్తుంది.ముఖ్యంగా సినిమా చివరలో మిగిలిన ఆ ప్రేమికులను చూస్తే కోపం కన్నా భాధ వస్తుంది.ఆ రేంజిలో ఎమోషన్స్ ని కాప్చర్ చేసిన ఈ సినిమాని వర్మ అభిమానులే కాక మిగతా వారు కూడా చూడతగినదే.

  English summary
  ‘Not A Love Story’ is definitely worth a watch. And yes, it has the touch of a brilliant filmmaker who has given films like ‘Satya’, ‘Rangeela’ and ‘Shiva’ in the past.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X