twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోరు కొట్టించడానికి 'ఒక్కడు చాలు'

    By Staff
    |

    Okkadu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: ఒక్కడు చాలు
    నటీనటులు: రాజశేఖర్‌, రంభ, సంఘవి, కోట శ్రీనివాసరావు
    సంగీతం: కోటి
    దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి

    వరుస ఫ్లాప్‌ లతో సతమవుతున్న రాజశేఖర్‌ ఈ సారి తన పాత మార్గాన్నే ఎంచుకున్నాడు. అంకుశం చిత్రంలో పోషించిన పోలీసు ఆఫీసర్‌ పాత్రతో రాజశేఖర్‌ కు ఓ ఇమేజ్‌ ఏర్పడింది. ఆ తరహా చిత్రాలన్నీ హిట్‌ అయ్యాయి. దాంతో ఈ సారి ఒక్కడు చాలు చిత్రంలో కూడ వృత్తి కోసం ప్రాణాలర్పించే పోలీసు అధికారి పాత్ర చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది కాస్తా వికటించింది. కొద్దిగా అంకుశం కథను అటు, ఇటుగా మార్చి.... కొన్ని ఆవేశపూరిత డైలాగ్‌ లు విసిరి....వండివార్చిన ఈ సినిమా వంటకం రుచీపచీ లేకుండా తయ్యారయింది. కథలో కొత్తదనం లేదు. కథనం వినూత్నం అంతకన్నా కాదు. పాత్రలు అవే.. వేషధారులే వేరు.

    సూర్య(రాజశేఖర్‌) తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో సుమలత, విష్ణువర్ధన్‌ దంపతులు పెంచి పెద్దచేస్తారు. సూర్య ఐపిఎస్‌ అధికారి అవుతాడు. సిన్సియర్‌ పోలీసు ఆఫీసర్‌ గా పేరు తెచ్చుకుంటాడు. నాలుగేళ్ల సర్వీసులో సూర్యను 16 సార్లు ట్రాన్స్‌ ఫర్‌ చేస్తారు. చివరికి హైదరాబాద్‌ కు ఏసిపిగా వస్తాడు. హైదరాబాద్‌ లో ధన్‌ రాజ్‌( శరత్‌ సక్సేనా) అనే రౌడీ ఉంటాడు. వీరి ముఠా చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, ఆయుధాల సరాఫరా... .. ఆఖరికి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లు కూడా చేస్తారు. మరి ఇలాంటి ధన్‌ రాజ్‌ ను పట్టుకోకుండా చూస్తూ కూర్చుంటాడా మన హీరో. వెంటనే రంగంలోకి దిగుతాడు. ధన్‌ రాజ్‌ కార్యకలాపాలను అడ్డుకుంటాడు.

    దాంతో ధన్‌ రాజ్‌ కు పిచ్చి కోపం వచ్చేస్తుంది. సూర్యను చంపేందుకు ప్లాన్‌ వేస్తాడు. ముందుగా సూర్య తల్లితండ్రులను చంపి సూర్యను మానసికంగా చిత్రహింసలు పెట్టాలని భావిస్తాడు. డ్రగ్‌ అడిక్ట్‌ సురేష్‌ సాయం కూడా తీసుకుంటాడు. ఇంతకీ సురేష్‌ ఎవరో కాదు. విష్ణువర్ధన్‌, సుమలతల అసలైన సుపుత్రుడు. సుపుత్రుడు డ్రగ్‌ అడిక్ట్‌ అయ్యేందుకూ ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంది. సురేష్‌ చిన్నప్పుడు స్కూల్లో టీచర్‌ ను కొడుతాడు. కొడుకు క్రమశిక్షణ తప్పాడని ఆగ్రహించిన విష్ణువర్ధన్‌ సురేష్‌ ను మందలిస్తాడు. అంతటితో ఊరుకోకుండా స్కూల్‌ పిల్లలందరి ముందు సురేష్‌ చేత టీచర్‌ కు క్షమాపణ చెప్పిస్తాడు.

    ఈ అవమానం భరించని మనవాడు ఇంటినుంచి పారిపోయి.... అలా డ్రగ్‌ అడిక్ట్‌ గా మారుతాడన్నమాట. మొత్తానికి ధన్‌ రాజ్‌ విష్ణువర్ధన్‌ ను చంపేస్తాడు. అలాగే సుమలతనూ చంపేందుకు ప్లాన్‌ వేస్తాడు. ఆమె నడుముకు టైంబాంబును పెట్టి ముఖ్యమంత్రిని, రక్షణమంత్రిని అంతమొందించేందుకు పథకం వేస్తాడు. (మధ్యలో సీఎం, రక్షణమంత్రిలను చంపడమెందుకు అని అడగకండి. అది అంతే.). కానీ మన హీరో అష్టకష్టాలు పడి, ఓ కాలు విరగ్గొట్టుకొని అందరినీ రక్షిస్తాడు. ధన్‌ రాజ్‌ ను, అతని ముఠాను మట్టుపెడుతాడు.

    అదండీ సినిమా. అంకుశం చిత్రాన్ని నానా రకాలుగా మర్చేసి తీసిన సినిమా ఇది. రాజశేఖర్‌ పాత్రలోనూ, నటనలోనూ మార్పులేదు. రంభ, సంఘవిల పాత్ర కేవలం పాటల వరకే. ఇక విలన్‌ శరత్‌ సక్సేనా, రామిరెడ్డిల నటన ఫర్వాలేదు. ఒక్క సురేష్‌ నటనే కాస్త రిలీఫ్‌. రామ్‌ పినిశెట్టి ఫోటోగ్రఫీ బావున్నా ఎడిటింగ్‌ లోపాల వల్ల పెద్దగా ఆకర్షించదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X