For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సోది ప్రేమికులు

  By Staff
  |

  Premikulu
  సినిమా: ప్రేమికులు (బట్‌ దె డోన్ట్‌నో ఈచ్‌ అదర్‌)

  విడుదల తేదీ: 4-8-05

  నటీనటులు: యువరాజ్‌, కామనా జెఠ్మలానీ, రిషీ గిరీష్‌,

  ఆహుతి ప్రసాద్‌, బ్రహ్మానందం, అలీ, మురళీమోహన్‌, సన,

  అభినయ శ్రీ, రాజ్యలక్ష్మి తదితరులు

  సంగీతం: సాజన్‌ మాధవ్‌

  కెమెరా: విజయశ్రీ

  ఫైట్స్‌: రాం లక్ష్మణ్‌

  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జయ

  నిర్మాత: బిఎ రాజు

  'చంటిగాడు' తర్వాత బి.జయ మళ్లీ కొత్తవారితో తీసిన ప్రేమ కథా చిత్రం 'ప్రేమికులు'. పాయింట్‌ కొత్తదైనా కథలో సహజత్వం లోపించడంతో ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతారు.

  నిజమైన ప్రేమకు మరణం లేదు అనే కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ కథ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. చందు(యువరాజ్‌) స్నేహితులతో ఆవారాగా తిరుగుతుంటాడు. ఓరోజు వెన్నెల (కామనా జెఠ్మలానీ)అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా సరేనని ప్రేమగీతాలు పాడుతుంది. ఇద్దరూ ఇలా ప్రేమసాగరంలో మునిగితేలుతుండగా ఒకరోజు వెన్నెల మామయ్య దిగుతాడు. వెన్నెలను పెళ్ళి చేసుకోవాలని అతని తాపత్రయం. వెన్నెల తల్లి కూడా అతనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. ఈలోగా చందు తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పి తన్నులు తింటాడు. ఇరువైపులా తమకు పరిస్ధితులు అనుకూలంగా లేకపోవడంతో పెద్ద బిల్డింగ్‌ నుంచి ఇద్దరూ కిందికి దూకేస్తారు.

  పై నుంచి దూకినా వాళ్ళిద్దరూ మరణించకుండా ఆస్పత్రిలో కోలుకుంటారు. మెదడుకు దెబ్బ తగలడంతో ఇద్దరూ గతం మర్చిపోతారు. ఒకరినొకరు గుర్తుపట్టలేని పరిస్ధితి. వైజాగ్‌లో ఉన్న మామయ్య వద్దకు వెన్నెలను పంపిస్తారు తలిదండ్రులు. చందుని కూడా అతని తలిదండ్రులు వైజాగ్‌ పంపిస్తారు. సినిమా ఫక్కీలో మళ్ళీ ఒకరికొకరు పరిచయమవుతారు. ఆ ప్రేమికులు మళ్ళీ ఎలా కలుసుకున్నారన్నది మిగితా కథ.

  ప్రేమికులకు ఆత్మహత్య పరిష్కారం కాదన్న స్టోరీలైన్‌ను ఎంచుకోవడం అభినందనీయం. హీరోయిన్‌ కామనా జెఠ్మలానీ బాగుంది. బ్రహ్మానందం హాస్యం కథకు ఉపయోగపడకపోయినా ఫర్వాలేదు. స్నోపార్క్‌లో తీసిన పాట చిత్రీకరణ బాగుంది. 'నువ్వు చూసిన చూపు' పాటలో సాహిత్యం బాగుంది. పాయింట్‌ కొత్తగా ఉందనిపించినా కథలో సహజత్వం లోపించింది. స్క్రీన్‌ప్లే లోపం వల్ల ప్రేక్షకుడు ఆసక్తి కోల్పోతాడు. మొదటి మలుపు లేకపోవడంతో కథ ఇంటర్వల్‌ వరకు ఏమీ జరగకపోవడంతో సాగతీసినట్లనిపిస్తుంది. ప్రధాన పాత్రధారులిద్దరూ సినిమా మొత్తం మీద తమ ప్రేమను గెలిపించుకోడానికి ప్రయత్నించకపోవడం, కాకతాళీయ సంఘటనలు జరిగి ప్రేమ గెలవడంతో క్లెయిమాక్స్‌ బలహీనపడిపోయింది. మహిళా దర్శకురాలి సినిమాలో రెండర్ధాల మాటలు, హీరోయిన్‌ అంగాంగ ప్రదర్శన విచారకరం. మాటలు వెలుగొండ శ్రీనివాసరావు అని చూపించి, చివర్లో కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం జయ అని వేసుకోవడం విచిత్రం. ఫస్ట్‌ హాఫ్‌లో ప్రేమ ఫీల్‌ రాకపోవడంతో వాళ్ళు ఎలాగైనా కలవాలని ప్రేక్షకుడికి అనిపించకపోవడం ఈ సినిమాలోని మైనస్‌ పాయింట్‌. హీరో యువరాజ్‌ పెద్ద మైనస్‌.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X