twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీ ఆంజనేయం - సమీక్ష

    By Staff
    |

    Srianjaneyam
    చిత్రం: శ్రీ ఆంజనేయం
    నటీనటులు: నితిన్‌, అర్జున్‌ ఛార్మి, చంద్రమోహన్‌,
    ఎల్బీ శ్రీరామ్‌, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, తదితరులు
    సంగీతం: మణిశర్మనిర్మాత: కృష్ణవంశీ
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ

    'మురారి' చిత్రం నుంచి దైవభక్తిని, వినోదాన్ని మిక్స్‌ చేస్తూ వస్తోన్న దర్శకుడు కృష్ణవంశీ, 'శ్రీ ఆంజనేయం' చిత్రంలో విజయం సాధించాడు. సినిమాను చాలా సాధారణంగా ప్రారంభించి, క్రమేపీ పెరిగేలా అద్భుతమైన గ్రాఫిక్స్‌, చిత్రీకరణ మాయాజాలంతో సినిమాను వినోదాత్మకంగా రూపొందడంలో కృష్ణవంశీ నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. ఆంజనేయస్వామి విశ్వరూపం వంటి గ్రాఫికల్‌ దృశ్యాలు అబ్బురపరుస్తాయి. తెలుగు సినిమా స్టాండర్డ్‌లో చూస్తే, ఆంజనేయ స్వామి గ్రాఫిక్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. సినిమా సాంకేతికంగా చాలా చాలా బాగుంది. లాజికల్‌ విషయాలను పక్కనపెడితే, సినిమా పైసావసూల్‌. కాకపోతే, కృష్ణవంశీ కృష్ణవంశీ ఇమాజినేషన్‌ దర్శకుడు రామనారయణ స్థాయిలా ఉండడం గమనార్హం.

    రాంప్రసాద్‌ ఫోటోగ్రఫీ, కట్టిపడేసే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, కలర్‌ఫుల్‌ ఆర్ట్‌... ఇలా సాంకేతిక నిపుణులు చూపిన ప్రతిభ బాగా కుదిరింది. నితిన్‌ను అర్జున్‌(ఆంజనేయస్వామి) గాలిలో తీసుకెళుతూ..ఓ కాలవ దాటించడం దృశ్యం చాలా సహజంగా, అబ్బురంగా ఉంది. మొత్తం గ్రాఫిక్స్‌లో చాలా వాస్తవికంగా అన్పించింది ఇక్కడే. అలాగే, ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఆంజనేయ స్వామి కన్పించడం బాగానే ఉన్నా, అందులో కొంచెం అసహజత కన్పించింది.

    ఇందులో కథ కన్నా, సినిమాను దర్శకుడు కృష్ణవంశీ తీసిన తీరు, నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభే బాగుంది. ఇవే సినిమాను ఆకట్టుకునేలా చేశాయి. అలరించేలా చేశాయి. కథ లాజిక్‌కు అందదు. ఇలాంటి పూర్తిగా వినోదాన్ని పంచే ఇలాంటి సినిమాల్లో అలాంటి లాజిక్‌ గురించి ఆలోచించడం కూడా పొరపాటే.

    నితిన్‌ అమాయకుడిగా హానెస్ట్‌గా నటించాడు. చాలా కష్టపడి నటించినట్లు కన్పించింది. అయితే, డైలాగ్‌ డెలివరి కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఆంజనేయుడి మనిషి అవతారంలో అర్జున్‌ చాలా బాగా చేశాడు. కోతిలా నడవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడంలోనూ, ఆంజనేయుడు భారీ ఆకారం విషయంలోనూ అర్జన్‌ చక్కగా సరిపోయాడు. బాలు డబ్బింగ్‌ కూడా గంభీరంగా సాగింది. ఛార్మి ఒళ్ళు దాచుకోకుండా నటించింది.

    రెండు పాటల్లో చూపించాల్సిన దానికన్నే అధికంగానే ఎక్స్‌పోజ్‌ చేసింది. ఆమెతో దర్శకుడు కృష్ణవంశీ మాటలు కూడా 'అతి'గానే చెప్పించాడు. ఆమె చెప్పిన మాటలకు మూడు సార్లు సెన్సార్‌ జరిగిందాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పీక పిసుకుతాను అని హీరో అంటే..పీక తప్ప ..అన్ని..(సెన్సార్‌) చేసుకో..అని ఛార్మి సమాధానమిస్తుంది ఓ సందర్భంలో. ఛార్మి పాత్ర మాస్‌ ప్రేక్షకులకు వినోదం కోసం సృష్టించింది. చంద్రమోహన్‌ పూజారి పాత్రకు న్యాయం చేకూర్చగా, విలన్‌ పాత్రధారి కూడా బాగా చేశాడు.

    ప్రేక్షకుడిలో ఆసాంతం (తొలి గంట మినహాయిస్తే) ఆసక్తిని పెంచేలా చిత్రీకరణలోనూ, స్క్రీన్‌ప్లేలోనూ కృష్ణవంశీ చాలా రోజుల(చిత్రాల?) తర్వాత మంచి ప్రతిభను కనబర్చాడు. అయితే, రాజమండ్రి బిడ్జిని దాటించే సీన్లు, పాము కన్పించే దృశ్యాలు..'డిజిటల్‌' మాయ అని ప్రేక్షకులకు సులువుగా అర్థమయ్యేలా కన్పించడం వంటి లోపాలను సవరిస్తే బాగుండేది. క్లైమాక్స్‌ దృశ్యాలు చిన్నపిల్లలకు బాగా నచ్చుతాయి.

    కథ: ఓ ఇంజనీర్‌ (ప్రకాష్‌రాజ్‌) సీతమ్మ తల్లి అనే ఆనకట్ట నిర్మించాలని భావిస్తాడు. అయితే, అక్కడ డ్యాం కడితే, ప్రజలు పచ్చగా ఉండి, తన మాట వినరని స్థానిక రాజకీయ నాయకుడు బ్రహ్మన్న దాని నిర్మాణాన్ని అడ్డుకుంటాడు. మాట వినకపోవడంతో, ఇంజనీర్‌ని, ఆయన భార్య(రమ్యకృష్ణ)ని చంపేస్తాడు. తల్లితండ్రుల మరణంతో అనా«థైన వారి బాబు (నితిన్‌) స్థానిక దేవాలయానికి చేరుకుంటాడు. బాబును గుడి పూజారి (చంద్రమోహన్‌) చేరదీసి వాడికి అంజి అని పేరు పెట్టి పెంచుతాడు. అంజి ఆంజనేయ స్వామి వీరభక్తుడు. గుడి చుట్టుపక్కల గ్రానైట్‌ ఉందని తెలుసుకొన్న బ్రహ్మన్న, గుడిని కూలగొట్టాలని ప్రయత్నిస్తాడు.

    అందుకోసం, ఓ చేతబడి చేసే మంత్రగాడు సాయం కోరుతాడు. వాడు అస్కలత బ్రహ్మచారిని బలి ఇవ్వాలని కోరుతాడు. సో..వారి కన్ను అంజిపై పడుతుంది. ఆంజనేయుడు తన భక్తుడిని కాపాడేందుకు మానవరూపాన్ని ధరించ వస్తాడు. ఆంజనేయుడు సాయంతో అంజి దుష్టులను శిక్షించి, ఆ ఆనకట్టను ఎలా నిర్మిస్తాడనేది మిగతా కథ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X