Just In
- 4 hrs ago
‘RRR’ తర్వాత రామ్ చరణ్ చేసేది ఆయనతోనే.. చిరంజీవి సలహా వల్లే ఈ నిర్ణయం.!
- 5 hrs ago
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- 5 hrs ago
ఆసక్తి రేకెత్తించిన క్వీన్ ట్రైలర్.. అమ్మగా ఆకట్టుకున్న రమ్యకృష్ణ
- 6 hrs ago
అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి.. అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Technology
బెటర్ సెక్యూరిటీతో క్వాల్కామ్ 3డి సోనిక్ మ్యాక్స్
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
శ్రీరామ్ చుట్టూ అల్లిన కథ
శ్రీరామ్ జీవితంలో సంభవించిన ఒక అనూహ్యమైన సంఘటన వల్ల అతని జీవితం మలుపులు తిరుగుతూ కథను నడిపిస్తుంది. ఆ అనూహ్యమైన సంఘటన టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకర్‌తో గొడవ పడడం. అతని గొడవ పడినప్పుడు ఒక పోలీసాఫీసరుతో తలపడుతున్నాననే విషయం శ్రీరామ్‌కు తెలియదు. బీచ్‌లో అమ్మాయిని అల్లరి పెడుతున్న ఒక తాగుబోతుకి బుద్ధి చెప్తున్నానని మాత్రమే అనుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్‌పై పగ పెంచుకుని అతన్ని ప్రతిచోటా అడ్డు తగులుతుంటాడు; ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఉదయ్ కిరణ్ హీరో వర్షిప్ కోసమే అన్నట్లు వాయ్‌లెన్స్ ఈ సినిమాలో కొంచెం ఎక్కువే అనిపిస్తుంది.
సినిమాలో కొన్ని గ్యాప్స్ వున్నాయి. శ్రీరామ్‌కు ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వచ్చిందా? అతని దరఖాస్తును త్రోసిపుచ్చి కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలేమయ్యాయి? ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. అయితే ఇది ప్రేక్షకుల ఊహాశక్తికి వీటిని వదిలేశారని సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో సమస్య కూడా ఉంది. అకస్మాత్తుగా శివకృష్ణ ఎక్కడి నుంచో ఊడిపడి శంకర్‌ను షూట్ చేయడం ఏమిటని ప్రేక్షకులకు అనిపించకమానదు.
హీరో అనిత క్యూట్‌గా కనిపిస్తుంది. శంకర్‌గా ఆశిష్ విద్యార్థి బాగా చేశాడు. పరుచూరి వెంకటేశ్వర రావు హెవీ క్యారెక్టర్‌లో కనిపించాడు. తనికెళ్ల భరణి విలన్ తరహా పాత్రను కొట్టిన పిండిలా చేసి చూపించాడు. అవనీతి పేరుకుపోయిన పోలీసాఫీసరుగా శివకృష్ణ నటించాడు. ఆర్.పి. పట్నాయక్ స్వరపరిచిన ''పెదవుల్లో పెప్సీకోలా...'' పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమాను బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.
మూడు చిత్రాల విజయం తర్వాత ఉదయకిరణ్ ఇటీవలే తన బర్త్‌డే జరుపుకున్నారు. దీని తర్వాత విడుదలయిన చిత్రం శ్రీరామ్. శ్రీరామ్ పాత్రలో ఉదయ్‌కిరణ్‌ను ఎలివేట్ చేసే ప్రయత్నం జరిగింది. అతనికి ఒక మాస్ అప్పీల్‌ను ఇచ్చే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు. రాను రాను ఉదయకిరణ్ మాస్ హీరోగా ఎదుగుతారా, లేదా అనేది వేచి చూడాల్సిందే. శ్రీరామ్ చిత్రం మాత్రం సూపర్ డూపర్ కాదు, ఒక యావరేజీ చిత్రమని చెప్పక తప్పదు.