twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెలబ్రేషన్స్ మొదలయ్యేలోపు ‘వినాయక చవితి’ సినిమా చూస్తే బెటర్!

    |

    తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... దేశ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి సందడి మొదలు కాబోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా భారతీయ సమాజం మొత్తం కలిసిగా కట్టుగా జరుపుకునే ఒకే ఒక్క వేడుక ఇది.

    ఈ తరం యువతకు వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుడి విగ్రహం ప్రతిష్టించి, 9 రోజుల పాటు పూజలు చేసి, ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం మాత్రమే తెలుసు. వినాయకుడి గురించిన చరిత్ర, ప్రతి పూజలో విఘ్నేశ్వరుడికి అగ్రతాంబూలం ఎందుకు ఇస్తారు? నీలాప నిందలు అంటే ఏమిటి అనేది చాలా మందికి తెలియదు.

    Ganesh Chaturthi special article on Vinayaka Chavithi movie

    ఈ విషయాల గురించి తెలియాలంటే 1957లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ 'వినాయక చవితి' చూడాల్సిందే. ఎన్టీ రామారావు కృష్ణుడి పాత్రలో నటించిన ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించారు. మనకు తరచూ వినిపించే 'వాతాపి గణపతిం భజే' పాట ఈ సినిమాలోనిదే. ఘంటసాల సంగీతం అందించారు.

    ఈ సినిమాలో చవితి రోజు చేయాల్సిన పూజా నియమాలు ఏమిటో చక్కగా చూపించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడంతటి వాడు వినాయక చవితి నాడు చంద్రున్ని చూపి నీలాపనిందల పాలయ్యాడు. శమంతమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.

    ఈ నీలాప నిందలను తొలగించుకోవడానికి వినాయకవ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకొని బయటపడి, జాంబవతి, సత్యభామలను వివాహమాడతాడు శ్రీకృష్ణుడు. మాన్యుల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఈ చవితినాడు వినాయక వ్రతం ఆచరించి.. విఘ్నేశ్వరుడిని ఆశీస్సులు పొందితే ఎలాంటి నీలాపనిందల పాలు కాకుండా ఉంటారు అనేది ఈ సినిమా ఇతివృత్తం.

    ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా ఎన్. టి. రామారావు, సత్యభామగా జమున, సతధనగా ఆర్.నాగేశ్వరరావు, సత్‌రాజిత్‌గా గుమ్మడి, రుక్మిణిగా కృష్ణ కుమారి, ప్రసేనగా రాజనాలా, ఎ. నారద మహర్షి పాత్రలో ప్రకాసారావు , వసంతకగా బాలకృష్ణ, పార్వతి దేవిగా సూర్యకళ, జంబవతిగా సత్యదేవి నటించారు.

    English summary
    Vinayaka Chavithi is a 1957 Telugu mythological film, produced by K. Gopala Rao under the Aswaraja Pictures banner and directed by Samudrala Sr. It stars N. T. Rama Rao and Jamuna in the lead roles and music composed by Ghantasala. The story is of Syamantakopakhyanam, annually read during the Ganesh Chathurthi festival day celebrations of Lord Vinayaka.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X