twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2022 Semi Hits: పవన్, మహేశ్‌ అన్ లక్కీ.. కొద్దిలో హిట్ కోల్పోయిన హీరోలు వీళ్లే.. అతడికి డబుల్ షాక్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎంతో ముఖ్యమైన సంక్రాంతి సీజన్ తేలిపోయినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం వరుసగా భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీనికితోడు డబ్బింగ్ మూవీలు కూడా తెలుగులో బాగానే సందడి చేశాయి. ఇలా ఇప్పటి వరకూ బాక్సాఫీస్ కాసుల వర్షంతో గళగళలాడిపోయింది. అయితే, 2022లో కొన్ని చిత్రాలు మాత్రం భారీ అంచనాలతో వచ్చి సెమీ హిట్లుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం తృటిలో విజయాలను అందుకోలేకపోయిన సినిమాలు గురించి తెలుసుకుందాం పదండి!

     అశోకవనంలో అర్జున కల్యాణం

    అశోకవనంలో అర్జున కల్యాణం

    విశ్వక్ సేన్ హీరోగా చింతా విద్యాసాగర్ తెరకెక్కించిన చిత్రమే 'అశోకవనంలో అర్జున కల్యాణం'. ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 5.80 కోట్లు బిజినెస్‌ను జరుపుకుని.. రూ. 6.30 కోట్ల టార్గెట్‌తో వచ్చింది. అయితే, ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 4.83 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రూ. 1.47 కోట్ల నష్టాలను చవి చూసింది. తద్వారా ఏబో ఏవరేజ్ లేదా సెమీ హిట్‌గా నిలిచింది.

    బ్రాలో తెగించిన హీరోయిన్: అమాంతం అది విప్పేసి మరీ హాట్ షోబ్రాలో తెగించిన హీరోయిన్: అమాంతం అది విప్పేసి మరీ హాట్ షో

    F3 పరిస్థితి కూడా అలాంటిదే

    F3 పరిస్థితి కూడా అలాంటిదే


    వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీనే 'F3'. ఈ చిత్రం రూ. 63.60 కోట్లు బిజినెస్ జరుపుకుంది. దీంతో ఈ సినిమా టార్గెట్ 64.50 కోట్లు అయింది. అయితే, ఈ మూవీ మాత్రం ఫుల్ రన్‌లో రూ. 56.91 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ మూవీకి ఫైనల్‌గా 7.59 కోట్లు నష్టాలు వచ్చాయి. ఫలితంగా ఇది కూడా హిట్‌కు దగ్గర్లో ఆగింది.

     హిట్ టాక్ కానీ.. సక్సెస్ కాలేదు

    హిట్ టాక్ కానీ.. సక్సెస్ కాలేదు


    నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే 'కృష్ణ వ్రిందా విహారి'. ఈ మూవీ ఓవరాల్‌గా రూ 5.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. దీంతో 5.60 కోట్ల టార్గెట్‌తో ఇది బరిలోకి దిగింది. కానీ, ఈ సినిమాకు రూ. 4.72 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం రూ. 88 లక్షలు నష్టాలతో రన్‌ను ముగించింది. ఫలితంగా ఏవరేజ్ కంటే ఎక్కువ లేదా సెమీ హిట్‌గా మిగిలింది.

    డ్రెస్ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్: పైన మాత్రం ఏమీ లేకుండానే!డ్రెస్ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్: పైన మాత్రం ఏమీ లేకుండానే!

    సర్కారు వారి పాటకు నష్టాలు

    సర్కారు వారి పాటకు నష్టాలు


    మహేశ్ బాబు - పరశురాం కలయికలో వచ్చిన 'సర్కారు వారి పాట' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో మాత్రం రూ. 110.12 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ మూవీ మరో రూ. 10.88 కోట్లు నష్టాలతో సెమీ హిట్‌గానే నిలిచి నిరాశనే ఎదుర్కొంది.

    ఓరి దేవుడా అనుకున్న విశ్వక్

    ఓరి దేవుడా అనుకున్న విశ్వక్


    అస్వత్ మరిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రమే 'ఓరి దేవుడా'. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు బిజినెస్‌ జరిగింది. దీంతో రూ. 6 కోట్లు టార్గెట్‌తో విడుదల అయింది. అయితే, ఈ మూవీ ముగింపు సమయానికి రూ. 5.72 కోట్లు షేర్‌ను రాబట్టింది. ఫలితంగా దీనికి రూ. 28 లక్షలు నష్టాలు వచ్చాయి. దీంతో వరుసగా రెండోసారి విశ్వక్‌కు షాక్ తగిలింది.

    <strong>ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!</strong><br />ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

    భీమ్లా నాయక్ పరిస్థితి అదే

    భీమ్లా నాయక్ పరిస్థితి అదే


    పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో సాగర్ కే చంద్ర తెరకెక్కించిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ. 97.63 కోట్లు వసూలు చేసింది. అంటే ఇది హిట్‌కు రూ. 10.37 కోట్లు దూరంలో ఆగిపోయింది. ఫలితంగా ఏబో ఏవరేజ్‌గా మిగిలిపోయింది.

    తమిళ బాహుబలికి బిగ్ షాక్

    తమిళ బాహుబలికి బిగ్ షాక్


    మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ భారీ మూవీ తెలుగులో రూ 10.50 కోట్ల టార్గెట్‌తో వచ్చింది. అయితే, టోటల్ రన్‌లో రూ. 9.63 కోట్లు వసూలు చేసి.. రూ. 87 లక్షలు నష్టాలను ఎదుర్కొని సెమీ హిట్‌గా నిలిచింది.

    Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!

    వలిమైతో మిస్ చేసిన అజిత్

    వలిమైతో మిస్ చేసిన అజిత్


    భారీ అంచనాలు ఏర్పరచుకున్న అజిత్ కుమార్ 'వలిమై' మూవీకి రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.65 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.70 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి రూ. 2.49 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే రూ. 21 లక్షలు నష్టాలతో రన్‌ను ముగించుకుని విజయాన్ని తృటిలో కోల్పోయింది.

    English summary
    So Many Telugu Movies Released in This Year. But Some Films Ended As above average at Box office. Let's See These Movies List.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X