For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Vijay Deverakonda: రియల్ ఫైటర్‌.. ఫ్యాన్స్‌కు రౌడీ బాయ్‌గా విజయ దేవరకొండ

  |

  టాలీవుడ్‌లో నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి చిత్రాల్లో చిన్న చిన్న వేషాలతో కెరీర్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డి చిత్రంతో క్రేజీ స్టార్‌గా మారిపోయారు. ఫెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్‌ను కలబోసి నటించే ఈ యువ హీరోకు వరుస విజయాలు కలిసి రావడంతో స్టార్ స్టేటస్ కోసం కష్టపడాల్సి రాలేదు. అయితే గతేడాది బలమైన హిట్ ఖాతాలో వేసుకోకపోవడంతో విజయ్ దేవరకొండ జోరు కాస్త తగ్గినట్టు అయింది. ఇలా చిన్న ఒడిదుకుల మధ్య విజయ్ దేవరకొండ మే 9న జన్మదినం జరుపుకొంటున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి మరిన్ని వివరాలు..

  ఎవడే సుబ్రమణ్యం నుంచి ఫైటర్ వరకు

  ఎవడే సుబ్రమణ్యం నుంచి ఫైటర్ వరకు

  కెరీర్ ఆరంభంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం చిత్రం నటుడిగా ఎదగడానికి ఉపయోగిపడింది. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా మంచి బ్రేక్ ఇవ్వడంతో ఈ రౌడీ స్టార్ కెరీర్ రాకెట్‌ స్పీడ్ అందుకొన్నది. వెంటనే అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఖాతాలో పడటంతో విజయ్ దేవరకొండకు ఎదురేలేకుండా పోయింది.

  100 కోట్ల క్లబ్‌లో

  100 కోట్ల క్లబ్‌లో

  ఇక వరుసగా మహానటి, గీతా గోవిందం లాంటి చిత్రాలు ఫెర్ఫార్మర్‌గా విజయ్ దేవరకొండను మరో మెట్టు ఎక్కించాయి. గీతా గోవిందం రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించడతో బాక్సాఫీస్ వద్ద పట్టు సాధించాడు. అదే ఊపులో టాక్సీవాలా కూడా కెరీర్‌కు పపోర్టుగా నిలచింది. అయితే నోటా, డియర్ కామ్రేడ్ కమర్షియల్‌గా హిట్ అయినప్పటికీ.. ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక వరల్డ్ ఫేమస్ లవర్‌ కూడా నిరాశపరచడం ఓ మెట్టు దిగినట్టయింది.

   హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా

  హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా

  హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు మాత్రం అభిమానుల ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. రోజు రోజుకు ఫ్యాన్స్‌ సంఖ్యను గణనీయంగా పెంచుకొంటూ పోతున్నాడు. ఇన్స్‌టాగ్రామ్‌లో 7 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించాడు. ఇక రౌడీ అనే పేరుతో డిజైనర్ వేర్ దుస్తుల తయారీ కంపెనీ ప్రారంభించారు. రౌడీ బ్రాండ్‌కు యూత్‌కు మంచి క్రేజ్ తెచ్చే విధంగా చేసుకొన్నారు.

  కరోనా సమయంలో

  కరోనా సమయంలో

  కరోనావైరస్ సమయంలో టాలీవుడ్ కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం ప్రకటించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందించారు. మిడిల్ క్లాస్ ఫండ్‌తో దాదాపు 8 వేలకుపైగా కుటుంబాలను ఆదుకొన్నారు. ఇంకా పలు స్వచ్ఛంద కార్యక్రమాలను విజయ్ దేవరకొండ కొనసాగిస్తున్నారు. ఇంకా పలు కార్యక్రమాలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

  Rashi Khanna Feeling Bad With Her Wrong Commitment
  విజయ్ దేవరకొండ కెరీర్

  విజయ్ దేవరకొండ కెరీర్

  ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇంకా హీరో చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలతో పలు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా కొన్ని ప్రాజెక్టుల ప్రకటించే అవకాశం ఉంది.

  English summary
  Arjun Reddy Fame Vijay Deverkonda is celebrating birthday on May 09th. On this occasion, Telugu filmibeat wishing a very Happy birthday and brings exclusive story about Rowdy star.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X