For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2021లో ఎక్కువ లాభాలు అందుకున్న మూవీలు: 2 చిన్న సినిమాలకు 30 కోట్లు.. రవితేజ, బాలయ్య కూడా గట్టిగానే!

  |

  గత ఏడాది కరోనా లాక్‌డౌన్ల కారణంగా చాలా అంటే చాలా తక్కువ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, ఈ ఏడాది మాత్రం పరిస్థితి కొంత చక్కబడడంతో చాలా చిత్రాలు విడుదల అయ్యాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రేక్షకుల ఆదరణ దక్కినా.. కలెక్షన్లను రాబట్టుకోలేక చాలా మూవీలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేకపోయాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం భారీ కలెక్షన్లను అందుకుని.. లాభాలను కూడా సొంతం చేసుకున్నాయి. ఇలా 2021లో కొన్ని చిత్రాలు కోట్ల రూపాయల ప్రాఫిట్లను వెనకేసుకున్నాయి. ఇక, ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా.. 2021లో ఎక్కువ లాభాలను అందుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం పదండి!

  ఉప్పెనతో బాక్సాఫీస్ షేకైందిగా

  ఉప్పెనతో బాక్సాఫీస్ షేకైందిగా

  మెగా కాంపౌండ్ నుంచి 'ఉప్పెన' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు పంజా వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ. 51.52 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 31.02 కోట్లు లాభాలను అందుకుని మొదటి స్థానంలో నిలిచింది.

  RRR First Review: విడుదలకు ముందే లీకైన రిపోర్టులు.. అసలు పాయింట్ అదే.. సినిమా ఎలా ఉంటుందంటే!

  జాతి రత్నాలుపై కలెక్షన్ల వర్షం

  జాతి రత్నాలుపై కలెక్షన్ల వర్షం

  నవీన్ పోలిశెట్టి హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు. రూ. 11 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరుపుకున్న ఈ మూవీ ఫుల్ రన్‌లో రూ. 39.52 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా రూ. 28.52 కోట్లు లాభాలను సొంతం చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతోంది.

  క్రాక్ పుట్టించిన రవితేజ సినిమా

  క్రాక్ పుట్టించిన రవితేజ సినిమా

  మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం 'క్రాక్'. ఠాగూర్ మధు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. టోటల్ రన్‌లో ఇది రూ. 39.16 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 22.16 కోట్లు లాభాలను ఖాతాలో వేసుకుని మూడో స్థానంలో నిలిచింది.

  Akhanda OTT: బాలయ్య సినిమా స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. పండుగ కానుకగా ఆరోజే.. మరి టీవీలో ఎప్పుడంటే!

   అఖండతో బాలకృష్ణ హడావిడి

  అఖండతో బాలకృష్ణ హడావిడి

  నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమానే 'అఖండ'. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, ఇది రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. నాలుగు వారాల్లోనే దీనికి రూ. 70.61 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో దీనికి రూ. 17.61 కోట్లు లాభాలు దక్కడంతో నాలుగో స్థానంలో ఉంది.

  రెడ్ మూవీతో రామ్ దూకుడుగా

  రెడ్ మూవీతో రామ్ దూకుడుగా

  కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని తెరకెక్కించిన చిత్రం 'రెడ్'. ఈ సినిమాను సొంత బ్యానర్‌లో స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించారు. ఇది కూడా సూపర్ సక్సెస్ అయింది. విడుదలకు ముందు రూ. 14 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ.. ఫుల్ రన్‌లో రూ. 19.79 కోట్లు కలెక్ట్ చేసింది. ఫలితంగా రూ. 5.79 కోట్ల లాభాలను సొంతం చేసుకుని ఐదో స్థానంలో నిలిచింది.

  భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ

  అఖిల్‌కు హిట్‌తో పాటు లాభం

  అఖిల్‌కు హిట్‌తో పాటు లాభం

  అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీతో అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టాడు. రూ. 18.50 కోట్ల బిజినెస్‌తో వచ్చిన ఈ సినిమా.. ఫుల్ రన్‌లో రూ. 24.14 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 5.64 కోట్ల లాభాలను ఖాతాలో వేసుకుని ఆరో స్థానానికి చేరుకుంది.

  డబ్బింగ్ సినిమాకూ లాభాలు

  డబ్బింగ్ సినిమాకూ లాభాలు

  ఈ ఏడాది తెలుగు సినిమాలే కాకుండా డబ్బింగ్ అయిన విజయ్ 'మాస్టర్' మూవీ కూడా మంచి లాభాలు అందుకుంది. గత సంక్రాంతికి రూ. 8 కోట్ల బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తెలుగులో ఫుల్ రన్‌ పూర్తయ్యే సరికి రూ. 14.60 కోట్లు రాబట్టింది. తద్వారా రూ. 6.60 కోట్ల లాభాలను సాధించింది. ఓవరాల్‌గా చూస్తే ఇది ఐదో స్థానంలో ఉన్నట్లు భావించాలి.

  English summary
  So Many Telugu Movies Released in This Year. But Few Films Got Huge Profits. Let's see about Most Profitable Telugu Movies 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X