2020 గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన మూవీస్.. చెత్త సినిమాలను కూడా వదల్లేదు

2020 చాలా మంది జీవితాలను ఎన్నో మలుపులు తిప్పింది. మరచిపోలేని చేదు అనుభవాలను కూడా మిగిల్చింది. ఇక ఇంటర్నెట్ ప్రపంచానికి మాత్రం గతంలో ఎప్పుడు లేనంత వాల్యూ పెరిగింది. ఒక్కసారిగా సెర్చ్ ఇంజెన్స్ పై కూడా అమితంగా భారం పడింది అంటే జనాలు ఎంతగా ఇంటర్నెట్ కు అలవాటు పడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఏడాది ఇండియాలో గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల లిస్టుపై ఒక లుక్కేస్తే..

నెంబర్ వన్ లో సుశాంత్ సినిమా

నెంబర్ వన్ లో సుశాంత్ సినిమా

ఒక సినిమా గురించి తెలుసుకోవాలి అంటే గూగుల్ లోకి వెళ్లాల్సిందే. అయితే 2020లో ఎక్కువగా పరిశోధించిన సినిమాల్లో దిల్ బెచారా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అందుకు కారణం సుశాంత్ సూసైడ్ చేసుకోవడం. జూన్ లో సూసైడ్ చేసుకున్న సుశాంత్ ఆఖరి సినిమా ఏది అనే కోణంలోనే దిల్ బెచారా భారీ స్థాయిలో వైరల్ అయ్యింది. అలాగే ఓటీటీలో అత్యదిక మంది వీక్షించిన సినిమాగా కూడా దిల్ బెచారా రికార్డ్ క్రియేట్ చేసింది.

 రెండవ స్థానంలో సూర్య బెస్ట్ మూవీ

రెండవ స్థానంలో సూర్య బెస్ట్ మూవీ

ఇక గూగుల్ లో టాప్ మోస్ట్ సెర్చిడ్ మూవీస్ లలో సూర్య సూరరై పొత్రు రెండవ స్థానంలో నిలిచింది. ఎయిర్ డెక్కన్ గోపినాథ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆమెజాన్ లోనే విడుదలైంది. ఇక హిట్ టాక్ రావడంతో సినిమాకు సంబంధించిన అసలు స్టోరీ కోసం నెటిజన్స్ ఎక్కువగా సెర్చ్ చేశారు.

మూడవ స్థానంలో తన్హాజీ

మూడవ స్థానంలో తన్హాజీ

ఇక ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో తన్హాజీ నిలిచింది.

మరాఠా యోధుడు తనాజీ మలుసారే జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ టైటిల్ పాత్రలో కనిపించగా అలీ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక
ఇక నాలుగవ స్థానంలో విద్యాబాలన్ నటించిన శకుంతల దేవి నిలిచింది. హ్యూమన్ కంప్యూటర్ గా పిలవబడే శకుంతల దేవి జీవిత ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా గూగుల్ లో బాగా ట్రెండ్ అయ్యింది.

జాన్వీ సినినకు కూడా భారీ క్రేజ్

జాన్వీ సినినకు కూడా భారీ క్రేజ్

2020లో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల్లో జాన్వీ కపూర్ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న గుంజన్ సక్సేనా జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కాంచనకు రీమేక్ గా వచ్చిన లక్ష్మీ సినిమా ఆరవ స్థానంలో నిలిచింది. రాఘవ లారెన్స్ ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

Ganesh Chaturthi 2019 : Vivek Oberoi & Family Celebrate Ganpati Visarjan
 ఆ చెత్త సినిమాను కూడా వదల్లేదు

ఆ చెత్త సినిమాను కూడా వదల్లేదు

ఇక సుశాంత్ సింగ్ మరబించిన తరువాత సడక్ 2పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వారసుల పిల్లలతోనే ఆ సినిమా చేశారని నేపోటీజ్ హీటెక్కిస్తున్న సమయంలో ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది అత్యదిక డిస్ లైక్స్ అందుకుంది. దాంతో సోషల్ మీడియా నుంచి గూగుల్ లో జనాలు సడక్ 2ని ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ సినిమా హాట్ స్టార్ లోనే విడుదలైంది. కానీ చెత్త టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ గూగుల్ లో బాగానే ట్రెండ్ అయ్యింది. ఇది 7వ స్థానంలో నిలిచింది. ఇక టైగర్ ష్రాఫ్ భాఘి 3 8వ స్థానంలో ఉండగక్ 9వ స్థానంలో సంగ్రాహాణ నిలిచింది. ఇక అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సీతాబో 10వ స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X