For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు హీరోయిన్‌తో సిద్దార్థ్ డేటింగ్: హాట్ టాపిక్‌గా ఇన్‌స్టా పోస్ట్.. హీరో ఒప్పుకున్నట్లేగా!

  |

  సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమాయణాలు లేకున్నా.. ఏదో ఒక కారణం చూపించి మరీ వారికి ముడిపెట్టేస్తూ ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అదే చిన్న హింట్ దొరికిందంటే చాలు.. లవ్ ట్రాకులు ఇట్టే బయటకు వచ్చేస్తుంటాయి. రహస్యంగా వ్యవహారం నడిపినా.. ఏదోలా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది అడ్డంగా బుక్కైపోయారు. ఈ నేపథ్యంలో సౌతిండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ డేటింగ్ వ్యవహారం చాలా హైలైట్ అయిన విషయం తెలసిిందే. ఈ నేపథ్యంలో అతడు హీరోయిన్ గురించి పోస్ట్ చేశాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  అలా పరిచయం.. తెలుగు స్టార్

  అలా పరిచయం.. తెలుగు స్టార్

  తమిళ సినిమా 'బాయ్స్'తో సిద్దార్థ్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. దాని తర్వాత 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. వీటిలో 'బొమ్మరిల్లు' ఎఫెక్ట్ టాలీవుడ్‌పై భారీగానే పడింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతడికి తెలుగు రాష్ట్రాల్లోనూ యమా క్రేజ్ వచ్చేసింది.

  డెలివరీ తర్వాత షాకింగ్‌గా సోనమ్: ఎద అందాలు చూపిస్తూ దారుణంగా!

  వరుస ఫ్లాపులు.. దూరంగా వెళ్లి

  వరుస ఫ్లాపులు.. దూరంగా వెళ్లి

  కెరీర్ ఆరంభంలో హీరో సిద్దార్థ్ తెలుగులో వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి సత్తా చాటాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలోనే పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి వరుసగా పరాజయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సిద్దార్థ్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. దీంతో అతడు తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాడు. ఆ తర్వాత నుంచి కోలీవుడ్‌లోనే మూవీలు చేశాడు.

  తెలుగులోకి రీఎంట్రీ.. బిగ్ షాక్

  తెలుగులోకి రీఎంట్రీ.. బిగ్ షాక్

  తెలుగులో నేరుగా సినిమాలు చేయకున్నా సిద్దార్థ్ డబ్బింగ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలోనే 'గృహం'తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 'మహాసముద్రం' అనే సినిమాతో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చాడు. శర్వానంద్ కూడా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో సిద్ధార్థ్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది.

  Nitya Menon Pregnant: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యమీనన్.. బిడ్డకు తండ్రి ఎవరంటే?

  లవ్ ట్రాకులతో ఫుల్ ఫేమస్‌గా

  లవ్ ట్రాకులతో ఫుల్ ఫేమస్‌గా


  హీరో సిద్దార్థ్ గతంలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడి లవ్ ట్రాకుల గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలోనే ఓ స్టార్ డాటర్‌తో లవ్ ట్రాక్ నడిపిన అతడు.. ఆ తర్వాత మరో ఇద్దరు కోలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, టాలీవుడ్ బ్యూటీతోనూ సిద్దూ ట్రాక్ నడిపాడు.

  ఇప్పుడు తెలుగు హీరోయిన్‌తో

  ఇప్పుడు తెలుగు హీరోయిన్‌తో

  ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హీరో సిద్దార్థ్.. ఇప్పుడు హైదరాబాదీ భామ అదితి రావు హైదరితో డేటింగ్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 'మహాసముద్రం' సినిమాలో జంటగా నటించినప్పటి నుంచే వీళ్లిద్దరూ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై మాత్రం ఎవరూ స్పందించడం లేదు.

  బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  ఆ ఫొటో షేర్ చేసి మరీ విష్

  అదితి రావు హైదరి, సిద్దార్థ్ మధ్య ప్రేమాయణం సాగుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంతో.. వీళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సిద్దూ చేసిన పోస్ట్ హైలైట్ అయింది. అక్టోబర్ 28న అదితి పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఆమెతో కలిసున్న ఫొటోను షేర్ చేసిన అతడు.. జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ విష్ చేశాడు.

  అలాంటి కామెంట్‌తో బలం

  అలాంటి కామెంట్‌తో బలం

  అదితి రావు హైదరి పుట్టినరోజు సందర్భంగా సిద్దార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లవ్ సింబల్ పెట్టి మరీ 'యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ చిన్న, పెద్ద కోరికలు అన్నీ తీరాలని.. నువ్వు ఇంకా చూడని ఎన్నో చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని రాసుకొచ్చాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న వార్తలకు మరింత బలం చేకూరిందని నెటిజన్లు అంటున్నారు.

  English summary
  Kollywood Hero Siddharth Very Actived In Social Media. Recently He Did Post on Aditi Rao Hydari. Then This Was Gone Hot Topic in Film Circles
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X