Don't Miss!
- Sports
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం!
- News
మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ: జీవితఖైదు విధించిన కోర్టు
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
2022 Debut Heroines: కొత్త అమ్మాయిలు అరాచకం.. ఆ బ్యూటీదే అసలైన రికార్డు.. పాపం వాళ్లందరికీ షాకే!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో పాటు విజయాలను కూడా సొంతం చేసుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోన్నారు. అలా ప్రతి ఏడాదీ ఎంతో కొంత మంది అమ్మాయిలు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 2022వ సంవత్సరంలో కూడా చాలా మందే కొత్త హీరోయిన్లు పరిచయం అయ్యారు. వాళ్లలోనూ కొందరు ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకోవడంతో పాటు క్రష్‌గా మారారు. ఆ పూర్తి వివరాలేంటో మీరే చూసేయండి!

అశోక వనం నుంచి వచ్చేసింది
విశ్వక్ సేన్ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీనే 'అశోక వనములో అర్జున కళ్యాణం'. ఇందులో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించగా.. ఆమె సోదరి పాత్రను రితికా నాయక్ చేసింది. ఈమె ఇందులో తనదైన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేసింది. దీంతో మెయిన్ హీరోయిన్ కంటే ఎక్కువ పేరును సంపాదించుకోవడంతో పాటు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.
Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

భీమ్లా నాయక్‌తో వచ్చిన భామ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రూపొందిన చిత్రమే 'భీమ్లా నాయక్'. ఈ చిత్రం ద్వారా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. ఇందులో ఆమె రానా భార్య పాత్రను పోషించింది. ఈ రోల్‌కు సినిమాలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. క్లైమాక్స్‌లో కూడా ఈ భామకే పేరొచ్చింది. దీంతో సంయుక్త ఒక్క మూవీకే పేరొందింది.

సుందరంతో వచ్చిన నజ్రియా
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'అంటే.. సుందరానికీ'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ద్వారా నజ్రియా నజీం టాలీవుడ్‌కు పరిచయమైంది. అయితే, ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. వాస్తవానికి గతంలోనే నజ్రియా 'రాజా రాణి' అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు వాళ్లకు పరిచయమైన విషయం తెలిసిందే.
నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!

న్యూజిలాండ్ పిల్ల పరిచయం
నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ రూపొందించిన సినిమానే 'కృష్ణ వ్రిందా విహారి'. ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో న్యూజిలాండ్‌కు చెందిన షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్‌ను సాధించలేదు. దీంతో ఏబో ఏవరేజ్‌గా నిలిచింది. కానీ, షెర్లీ మాత్రం తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.

ఒక్క సినిమాతో ఇద్దరు ఎంట్రీ
విశ్వక్ సేన్ నటించిన మరో చిత్రమే 'ఓరి దేవుడా'. ఈ మూవీ ద్వారా తెలుగులోకి ఇద్దరు హీరోయిన్లు పరిచయం అయ్యారు. వాళ్లే మిథిలా పాల్కర్, ఆశా భట్. ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ దక్కింది. కానీ, ఫుల్ రన్‌లో మాత్రం మొత్తం కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో ఇది సెమీ హిట్‌తో సరిపెట్టుకుంది. కానీ, ఈ ఇద్దరు హీరోయిన్లకు మాత్రం అదిరిపోయే గుర్తింపు దక్కింది.
కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

ఈ సీత మాత్రం ఫుల్ ఫేమస్
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం 'సీతా రామం'. ఈ మూవీ ద్వారా మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రల్లో కనిపించిన ఈ చిన్నది తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే, భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుని ఈ ఏడాది టాప్ హీరోయిన్‌గా రికార్డు సాధించింది.

మరికొందరు... ఆమెకు హిట్
ఇక, 2022లో 'మసూద' అనే హర్రర్ మూవీ ద్వారా బాందవి శ్రీధర్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. అలాగే, ఈ సంవత్సరం 'హైవే' అనే చిత్రంతో మానసా రాధాకృష్ణన్ కూడా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ, ఈ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇలాగే మరికొందరు భామలూ వచ్చి పలకరించారు.