»   » రోబో కథకీ 2.0 కీ సంబంధం లేదు: బాంబు పేల్చిన శంకర్, అసలు కథ ఇదేనా??

రోబో కథకీ 2.0 కీ సంబంధం లేదు: బాంబు పేల్చిన శంకర్, అసలు కథ ఇదేనా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
రోబో 2.0 అసలు కథ ఇదేనా?? Here Is The Story Of Shankar's "2.0"

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ - ఏ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన రోబో సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. 2010లో వ‌చ్చిన ఈ సినిమా ఇండియ‌న్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఈ సినిమా ర‌జ‌నీ - శంక‌ర్ ఇద్ద‌రి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. ఈ సినిమా త‌ర్వాత అటు ర‌జ‌నీ, ఇటు శంక‌ర్ ప్లాప్‌లు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న 2.0 సినిమా కోసం ఇండియ‌న్ సినీ జ‌నాలు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

రోబో 2.0

రోబో 2.0

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే రూ. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న "రోబో 2.0" 25 జ‌న‌వ‌రి, 2017న రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఇంకోలాగా ఉంది. ఈ సినిమాలో రజినీకాంత్ రోబోగా కనిపించడం మినహాయిస్తే ‘రోబో'కు దీనికి అసలు పోలికే ఉండదంటున్నాడు శంకర్. ‘రోబో' కథకు ఇది కొనసాగింపు కాదని శంకర్ చెప్పాడు. ఓ కొత్త కథతో తాను ఈ సినిమా తీసినట్లు వెల్లడించాడు. అంటే రోబోలో ఉన్న ‘చిట్టి' పాత్ర కూడా ఉండదన్నమాట.

 చిట్టీ రోబో

చిట్టీ రోబో

అప్పట్లో "చిట్టీ రోబో" సృష్టించిన అలజడి మామూలుది కాదు ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తుండటంతో.. ఈ 2.0 పై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ సినిమాలంటే.. సినిమా వచ్చే వరకు ఒక్క ఫోటో కూడా లీక్ కాదు. అయితే ఇప్పుడు రోబో 2.0 కథ గురించి చిన్న‌లైన్ బ‌య‌ట‌కు లీక్ కాకుండా ద‌ర్శ‌కుడు శంక‌ర్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.

అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు

అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు

అయితే 2.0 స్టోరీ ఇదేనంటూ చెన్నై స‌ర్కిల్స్‌లో ఓ కథ ప్రచారం జరిగిందామధ్య. అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు గానీ ఒక వేళ ఇప్పుడు ఇదే నిజమైన కథేమో అన్న అనుమానమూ కలక్కపోదు. ఎందుకంటే ఆ క‌థ కూడా చాలా ఆస‌క్తిగా ఉంది...దీనిని తెర‌మీద చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది.

ట్రెండ్ అవుతోన్న క‌థ ప్ర‌కారం

ట్రెండ్ అవుతోన్న క‌థ ప్ర‌కారం

అక్క‌డ ట్రెండ్ అవుతోన్న క‌థ ప్ర‌కారం.. ఓ వ్యక్తి (అక్షయ్‌కుమార్‌)కి పిచ్చి ప్రేమ. ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల అరుదైన ప‌క్షుల‌ను అత‌డు ప్రేమ‌తో పెంచుకుంటూ ఉంటాడు. అయితే అత‌డు పెంచుకుంటున్న ప‌క్షుల‌న్ని చ‌నిపోతూ ఉంటాయి. దీనిపై అత‌డు ఆరా తీస్తే ప్ర‌పంచంలో పెరుగుతోన్న టెక్నాల‌జీ ఎఫెక్ట్‌తో చాలా ప‌క్షిజాతులు అంత‌రించిపోతున్నాయ‌ని అత‌డికి తెలుస్తుంది. దీంతో అత‌డు టెక్నాల‌జీపై కోపం పెంచుకుంటాడు.

అవినీతిని అంతం చేసేందుకు

అవినీతిని అంతం చేసేందుకు

ప్ర‌పంచంలో ఉన్న సైంటిస్టుల‌ను, టెక్నాల‌జీని నాశ‌నం చేయాల‌ని అత‌డు భావిస్తాడు. ఇదిలా ఉంటే సైంటిస్ట్ అయిన ర‌జనీకాంత్‌ అవినీతిని అంతం చేసేందుకు ఓ రోబోను క‌నిపెడ‌తాడు. ఆ సైంటిస్ట్‌, అత‌డు కనిపెట్టిన రోబో, ఆ పక్షి ప్రేమికుడు... ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ ‘2.0' కథ ఉంటుందని సమాచారం. స్టోరీ చూస్తుంటేనే సినిమాలో విజువ‌ల్స్ అదిరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మరి ఇదే కథ అసలు కథ అని చెప్పలేం.. అసలు కథ ఏంటో తెలియాలంటే.. సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 శాస్త్రవేత్తగా - రోబోగా రజినీ

శాస్త్రవేత్తగా - రోబోగా రజినీ

ఐతే రజినీ ఇందులో కూడా శాస్త్రవేత్తగా - రోబోగా కనిపిస్తాడన్నది మాత్రం పక్కా. ‘రోబో'లో విలన్ కూడా రజినీయే కాగా.. ‘2.0'లో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నాడు. మరి ఈ పాత్రలతో శంకర్ కథను ఎలా నడిపించాడన్నది ఆసక్తికరం. ఇటీవలే ‘2.0' త్రీడీ మేకింగ్ కు సంబంధించి చిత్ర బృందం రిలీజ్ చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.

భారీ ఖర్చుతో ఆడియో వేడుక

భారీ ఖర్చుతో ఆడియో వేడుక

ఈ నెలాఖర్లో దుబాయ్ వేదికగా భారీ ఖర్చుతో ఆడియో వేడుక చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ‘2.0' టీజర్ లాంచ్ ఉంటుంది. డిసెంబర్లో చెన్నైలో ట్రైలర్ విడుదల చేస్తారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ గత ఏడాదే ముంబయిలో చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0' ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాన్నాళ్ల కిందటే షూటింగ్ ముగించిన శంకర్.. కొన్ని నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నాడు.

English summary
The sources close to the Robo film unit revealed that 2.0 is not a continuation for Robo and we also won't be seeing Chitti - The Robor again in the second part.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu