Don't Miss!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
AR Rahman స్టూడియోలో ప్రమాదం.. టెక్నీషియన్ మృతి?
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. భారతదేశం గర్వించదగిన సంగీత దర్శకులలో ఏఆర్ రెహమాన్ టాప్ లో ఉంటారు అని చెప్పవచ్చు. కేవలం ఒక దేశానికి మాత్రమే కాకుండా ఆయన ప్రపంచానికి కూడా నచ్చే విధంగా పాటలు కంపోజ్ చేస్తారు. సంగీతం అనేది ఒక భాష, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదాని నిరూపించారు.
అయితే కింది స్థాయి నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఊహించని ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారనే న్యూస్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

మెటావర్స్ కత్రార్ కోసం..
ప్రపంచవ్యాప్తంగా తన మ్యూజిక్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్నారు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్. ఇటీవల ఆయన సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తన కంపోజింగ్ తో ఎన్నో విభిన్నమైన వాయిద్యాలను సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చి మంచి ప్రాముఖ్యతను చాటారు.
ఇటీవలే కొత్త మ్యూజిక్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కత్రార్ ప్రాజెక్ట్ లాంచ్ కోసం సంసిద్ధమయ్యారు. జనవరి 6న ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వతంత్ర సంగీతకారులు, ఆర్టిస్టుల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన మెటావర్స్ ప్రాజెక్ట్ కత్రార్ కు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

లైట్స్ సరి చేస్తుండగా..
మెటావర్స్ ప్రాజెక్ట్ కత్రార్ లాంచ్ కోసం ఎంతో శ్రమిస్తున్నారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ క్రమంలో ఆయన స్టూడియోలో ప్రమాదం జరిగిందని తమిళ వెబ్ సైట్స్ కథనాలు రాశాయి. ఎంతో కష్టపడి ఆస్కార్ స్థాయికి ఎదిగిన ఏఆర్ రెహమాన్ కు చెన్నైలో ఒక పెద్ద స్టూడియో ఉంది. ఈ స్టూడియో ద్వారా ఎన్నో కార్యక్రామాలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఎప్పటిలా స్టూడియోలో ఒక పోగ్రామ్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లైన్ మెన్ మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని తిరువళ్లూరు ఏరియాలో రెహమాన్ కు చెందిన పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో లైట్స్ సరి చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

రాని అధికారిక ప్రకటన..
ఈ ప్రమాదంలో లైట్ మెన్ కరెంట్ షాక్ తో చనిపోయినట్లు తమిళ వెబ్ సైట్స్ కథనాలు రాశాయి. లైట్లు మార్చుతుండగా.. లైన్ మెన్ కు షాక్ తగిలి కిందపడిపోయాడని.. కరెంట్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడిక్కడే అతను మరణించినట్లు సమాచారం.
అయితే ఈ ప్రమాదానికి సంబంధించి రెహమాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా ఏఆర్ రెహమాన్ మెటావర్స్ ప్రాజెక్ట్ కత్రార్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కోబ్రా, లైఫ్ ఆఫ్ ముత్తు, పొన్నియన్ సెల్వన్ సినిమాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతోపాటు పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.