రాజమౌళికి అజిత్ దిమ్మతిరిగే షాక్.. బాహుబలి రికార్డు మటాష్..
దర్శకధీరుడు.. జక్కన్న రాజమౌళికి.. తమిళ స్టార్ అజిత్ ఝలక్ ఇచ్చాడు. ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా..
దర్శకధీరుడు.. జక్కన్న రాజమౌళికి.. తమిళ స్టార్ అజిత్ ఝలక్ ఇచ్చాడు. ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా.. అన్ని వుడ్ లనూ క్లీన్ స్వీప్ చేసిన బాహుబలి సినిమాను మించి కలెక్షన్లు సాధించాడు. రీసెంట్ గా విడుదలైన మోస్ట్ స్టైలిష్ ఎంటర్ టైనర్ వివేగం సినిమాతో.. తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు... అజిత్. చెన్నైలో బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన రికార్డులను అవలీలగా చెరిపేస్తూ.. అద్భుతమైన రికార్డులను తన పేర లిఖించుకున్నాడు.

3 వేల థియేటర్లు.. మొదటి రోజే 33 కోట్లు
వివేగం సినిమా గత నెల 24న ప్రపంచవ్యాప్తంగా 3 వేల థియేటర్లలో విడుదలైంది. మిశ్రమ రివ్యూలతో సినిమా తేడా కొట్టిందన్న ప్రచారం జరిగింది. కానీ.. ఆ ప్రచారం కొంత కాలమే వినిపించింది. రోజులు గడుస్తున్నాకొద్దీ.. వివేగం మ్యాజిక్ పెరుగుతోంది. మొదటిరోజే 33 కోట్ల 8 లక్షల రూపాయల వసూళ్లు సాధించిన వివేగం.. అజిత్ కు తమిళ మాస్ జనాల్లో ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందన్నదీ మరోసారి నిరూపించింది.

ఒక్క చెన్నైలోనే 8 కోట్ల రూపాయలు
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కలిపి 33 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన వివేగం.. రెండో వారం కూడా.. అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది. కేవలం చెన్నైలోనే.. రెండో వారం మొత్తం కలిపి.. ఏకంగా 8 కోట్ల రూపాయల మొత్తాన్ని కొల్లగొట్టింది. సినిమాపై అభిమానుల ఆదరణ ఏ మాత్రం తగ్గలేని ఈ వసూళ్లతో స్పష్టంగా తెలిసిపోతోంది. క్రేజ్ ఇలాగే కొనసాగితే.. అంచనాలకు మించి.. వసూళ్లు జరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

జీఎస్టీ తర్వాత మొదటి వంద కోట్ల సినిమా
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత.. విడుదలైన సినిమాలు.. వంద కోట్ల వసూళ్లు సాధించడం కష్టంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో కూడా.. వివేగం సినిమా.. వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ తో సినిమా ప్రదర్శన భారంగా మారుతున్న పరిస్థితుల్లో కూడా.. ఇంత మొత్తం వసూలు కావడం వండర్ అని.. అందరితో అనిపిస్తోంది.

ఆకట్టుకున్న ఇంటర్ పోల్ ఆఫీసర్ స్టోరీ
మాస్ కు బాగా దగ్గరైన కథ. ఇంటర్నేషనల్ స్పై ఆఫీసర్ కు చెందిన స్టోరీ. గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి. కానీ.. అజిత్ అభిమానులను ఇంతగా మెప్పించలేకపోయాయి. ఇందులో అజిత్ కు తోడు.. కాజల్, వివేక్ ఒబెరాయ్, అక్షరా హాసన్ పోటీ పడి నటించి.. సినిమాను టాప్ రేంజ్ కు తీసుకెళ్లారు. ఆ ఫలితమే.. ఇప్పుడు వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











