For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భార్యకు గిఫ్ట్‌గా ఐఫోన్ ఆర్డర్ చేసిన హీరో.. బాక్స్ ఓపెన్ చేస్తే షాక్, ప్లిప్ కార్ట్ చీటింగ్!

  |

  తమిళ హీరో నకుల్ కు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆన్లైన్ షాపింగ్ సంస్థ ప్లిప్ కార్ట్ చేతిలో మోసపోయాడు. ఈ విషయాన్ని నకుల్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. శంకర్ తెరకెక్కించిన బాయ్స్ చిత్రంతో నటుడిగా పరిచమైన నకుల్ ఆ తరువాత కొన్ని తమిళ చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో కీలుగుఱ్ఱం చిత్రంలో మెరిశాడు. ప్లిప్ కార్ట్ మోసంతో ఈ హీరో మూడవ మ్యారేజ్ యానవర్సరీ నిరాశాజనకంగా మారింది. ఇంతకీ నకుల్ ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఏంటో ఇప్పుడు చూద్దాం.

   భార్య కోసం

  భార్య కోసం

  త్వరలో జరగబోయే తన మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా నకుల్ తన భార్యకు ఏదైనా మంచి గిఫ్ట్ అందించాలని భావించాడు. ఐఫోన్ కొనిస్తే బావుంటుందని ఉద్దేశంతో వెంటనే ఆన్లైన్ షాపింగ్ సంస్థ ప్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేశాడు. ఇటీవలే ప్లిప్ కార్ట్ సంస్థ నుంచి ఫోన్ వచ్చిన బాక్స్ అందుకున్నాడు. బాక్స్ ఓపెన్ చేసి చూసే సరికి కంగుతినాల్సి వచ్చింది. ప్లిప్ కార్ట్ సంస్థ నకుల్ ని చీట్ చేస్తూ నకిలీ ఫోన్ ని పంపించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ వాపోయాడు.

  ప్లిప్‌కార్ట్‌ని సంప్రదిస్తే

  ప్లిప్ కార్ట్ నుంచి నకిలీ ఫోన్ అందుకున్నా. చాలా నిరాశగా అనిపించింది. వెంటనే సదరు సంస్థని సంప్రదించగా వారి నుంచి సరైన సమాధానం కానీ, ఫోన్ మార్చుతామనే హామీ కానీ ఇవ్వలేదు. నాకు అందించిన ఫోన్ పూర్తి గా డ్యామేజ్ అయి ఉంది. ఫోన్ సాఫ్ట్ వేర్ కూడా ఐఓఎస్ కాదు. ఐఫోన్ లో ఉండే ఫీచర్స్ లేవు. దీనిద్వారా వీళ్ళు నన్ను చీట్ చేసారని అర్థం అయింది అంటూ నకుల్ తాను అందుకున్న ఫోన్ ఫోటోలు షేర్ చేశాడు.

  మరోమారు మాటల గారడీ

  మరోమారు మాటల గారడీ

  నేరుగా ప్లిప్ కార్ట్ ఆఫీస్ కు వెళ్లి మాట్లాడా. వాళ్ళు ఆపిల్ స్టోర్ కు వెళ్ళమని చెప్పారు. చాలా ఇబ్బందుల తరువాత ఫోన్ మార్చడానికి అంగీకరించారు. రేపే వచ్చి ఫోన్ మార్చడమో లేక డబ్బులు రీ ఫండ్ చేయడమో చేస్తామని తెలిపారు. కానీ ఆ మరుసటి రోజు ఎవరూ రాలేదు. పైగా 12 రోజుల సమయం పడుతుంది అంటూ మెయిల్ పెట్టారు అని నకుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  ఎట్టకేలకు స్పందించిన ప్లిప్ కార్ట్

  ఎట్టకేలకు స్పందించిన ప్లిప్ కార్ట్

  నకుల్ సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకోవడంతో ఎట్టకేకకు ప్లిప్ కార్ట్ సంస్థ స్పందించింది. ట్విట్టర్ లో నకుల్ కు మెసేజ్ పెడుతూ.. అసౌకర్యానికి చింతిస్తున్నాము.. నకుల్ మీ ఆర్డర్ వివరాలు పంపండి. సమస్య పరిష్కరిస్తాం అని ప్లిప్ కార్ట్ సంస్థ ట్వీట్ చేసింది. ప్లిప్ కార్ట్ వేదికగా ఇలాంటి చీటింగ్స్ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. నకుల్ సెలెబ్రిటీ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

  English summary
  Actor Nakkhul alleges he was duped by Flipkart after receiving fake iPhone XS Max Calling it a “very bitter and terrible experience”, Nakkhul said he was not given a guarantee by Flipkart that it’ll be resolved soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X