»   » భయపెట్టేందుకు అమలాపాల్ సన్నాహాలు

భయపెట్టేందుకు అమలాపాల్ సన్నాహాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : హర్రర్‌ చిత్రంలో నటించేందుకు అనువుగా తనను తాను మార్చుకునే ప్రయత్నంలో ఉందట అమలాపాల్‌. 'మైనా'తో గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అమలాపాల్‌ హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కే ఓ లేడీ ఓరియెంటడ్‌ పాత్రలో నటించనుంది. సముద్రకని దర్శకత్వంలో నానికి జంటగా 'జెండాపై కపిరాజు‌'లో అమలాపాల్‌ నటించింది. ఈ చిత్రంలో ఆమె నటన చూసి సంతృప్తి చెందిన సముద్రకని... తాను నిర్మించనున్న ఓ హర్రర్‌ చిత్రంలో నటించేందుకు ఆమెను ఎంపిక చేసుకున్నారు.

నటనకు అవకాశమున్న పాత్ర కావటంతో అమలాపాల్‌ కూడా ఆనందంగా అంగీకరించిందట. ఇటీవల హర్రర్‌ చిత్రాలకు చక్కని ప్రజాదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆమె కూడా భారీ ఆశలే పెట్టుకుందట. దీనికి తగినట్లు తనను తాను మార్చుకునే పనిలో ఉందట. ఆ తరహా చిత్రాలను వీక్షిస్తోందట. దక్షిణాదికి చెంది పలువురు స్టార్‌ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్‌ పాత్రల్లో మెప్పిస్తున్న నేపథ్యంలో తానూ ఆ జాబితాలో చేరేందుకు ఉవ్విళ్లూరుతోందీ ముద్దుగుమ్మ.

Amala Paul to act in a horror film

నాన్న, ఇద్దరమ్మాయిలతో ,బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, నాయిక్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన హీరోయిన్ ...అమలా పాల్. అయితే ఆమెకు తెలుగు నుండి ఆమెకు సరైన ఆఫర్స్ రావటం లేదు. దాంతో తమిళం వైపే మళ్లీ మ్రొగ్గుచూపింది. తాజాగా తమిళ తెరపై ప్రభంజనం సృష్టిస్తున్న హీరో శివకార్తికేయన్ తో ఆమె కమిటైంది‌. శివ తొలిసారిగా పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నాడు. తరచూ హాస్య పాత్రల్లో కనిపిస్తున్న తాను.. భిన్నంగా కనిపించాలనే ఈ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే మోహన్ లాల్ తో ఓ మళయాళ చిత్రం సైతం కమిటైంది.


ప్రేమఖైదీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కోచ్చి సుందరి అమలాపాల్‌. ఆ చిత్రంలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సహజసిద్ధంగా నటించి మెప్పించింది ఈ సుందరి. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్యతో 'బెజవాడ'లో నటించే అవకాశం సైతం దక్కించుకుందీ భామ. ఇతర కథానాయకల్లా గ్లామరస్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న స్క్రిప్టులను ఎంపికచేసుకుని తెలివిగా ముందడుగేస్తోందీ సుందరి.

తొలిచిత్రంతోనే జాతీయ అవార్డ్‌ అందుకోవడమే గాకుండా ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌కు కూడా నామినేట్‌ అయ్యింది. ఇటీవల 'దైవ తిరుమగల్‌'తో తమిళంలో విజయాన్ని నమోదుచేసుకుంది. అదే సినిమా తెలుగులో 'నాన్న'గా విడుదలై ..ఇక్కడా గుర్తింపును పెంచింది. ఇద్దరమ్మాయిలతోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన నాయిక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

English summary
Amala Paul has shown keen interest in doing a horror film now. This film will be produced by Samutrakani, the director of Jenda Paikapiraju. A new director is said to be launched in this bilingual. More details on the subject, cast and crew will soon be revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu