»   » ఒక్క అంజలి కాదు ఇద్దరూ : ట్రాన్స్ జెండర్ తో పాటు సీతమ్మ... అంజలి కూడా

ఒక్క అంజలి కాదు ఇద్దరూ : ట్రాన్స్ జెండర్ తో పాటు సీతమ్మ... అంజలి కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అంజలి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ బ్రహ్మాండంగా హిట్ అయింది. అందులో అంజలి పెర్ఫార్మెన్స్ ను అందరూ మెచ్చుకున్నారు. అంజలికి ఇంక తిరుగులేదని, దూసుకెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. వస్తాయనుకున్న సినిమాలు రాలేదు. కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఆమధ్య 'సరైనోడు' మూవీలో అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేసింది కానీ ఆమెకు అంతగా ఎలెవేషన్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు లేవనే చెప్పాలి.

ఎట్టకేలకు చిత్రాంగద సినిమాలో అంజలికి ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజ్ లో కొన్ని ప్రాబ్లెమ్స్ వచ్చాయి. కోలీవుడ్ లో ఛాన్స్ ల కోసం చెన్నైకి షిఫ్ట్ అయింది. అయితే అంజలికి అనుకోకుండా ఓ బిగ్ ఆఫర్ వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టితో నటించే ఛాన్స్ వచ్చిందట. జాతీయ అవార్డు పొందిన మలయాళ దర్శకుడు రామ్ డైరెక్షన్ లో ఈ చిత్రం తయారవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మరి ఈ చిత్రంతో అంజలి తన కెరీర్ ని ఎలా బ్రైట్ చేసుకుంటుందో చూడాలి.

అయితే ఇక్కడ మరో మెలిక ఉంది ఒక్క అంజలి కాదు ఇద్దరు అంజలి లకి ఈ సినిమాలో చాన్స్ ఉంది. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు రొమాన్స్‌ చేస్తున్నారన్నది తాజా సమాచారం. మమ్ముట్టి చాలా గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు తంగమీన్‌గళ్‌ వంటి ఉత్తమ అవార్డులను అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్‌ తాజగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇది.

‘Anjali’ to pair with Mammootty!

వేసవి కాలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి పేరంబు అనే పేరును నిర్ణయించారు. చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక కథానాయకిగా అంజలి నటిస్తున్నారు. ఈ అమ్మడు చిన్న గ్యాప్‌ తరువాత నటిస్తున్న తమిళ చిత్రం ఇది. కాగా ఇందులో మరో అంజలి కూడా నాయకిగా నటిస్తుండటం విశేషం. కేరళాకు చెందిన ఈమె పేరు అంజలి అమీర్‌. తను హిజ్రా కావడం మరో విశేషం.

ప్పటికే మంచి మోడల్‌గా గుర్తింపు పొందిన ఆమె మమ్ముట్టి సరసన 'పేరంబు' అనే తమిళ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'తంగమీన్‌గళ్‌' వంటి అవార్డ్ సినిమాను తెరకెక్కించిన రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పేరంబు సినిమాలో అంజలి అమీర్ తన కోస్టార్ అంటూ స్వయంగా మమ్ముట్టి ట్వీట్ చేశారు. మమ్ముట్టితో కలిసి నటించడం సరికొత్త అనుభవం అంటోంది అంజలి. ఆయన ప్రోత్సాహం మరువలేనిదని చెప్పుకొచ్చింది. మమ్ముట్టి చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్నారు.

English summary
Anjali has focused on Kollywood to act in some cinemas. Recently, she has an offer to pair with renowned Malayalam actor Mammootty. Ace Malayalam Director Ram is going to direct this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X