»   » ప్రభాస్ అందగాడే కాదు.. గొప్పవ్యక్తి.. జయహో బాహుబలి.. (ఫొటోలు)

ప్రభాస్ అందగాడే కాదు.. గొప్పవ్యక్తి.. జయహో బాహుబలి.. (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి పాత్రలో విశేషమైన ప్రతిభను కనబరిచిన ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాహుబలి2 సినిమాతో యంగ రెబల్ స్టార్ రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి హీరోగా చరిత్రలోకి ఎక్కాడు. దక్షిణాదిలో సీనియర్ నటుడు, మా పల్లెలో గోపాలుడుతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అర్జున్ తాజాగా ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. బాహుబలి2 సినిమా షూటింగ్‌లో కుటుంబ సమేతంగా యూనిట్‌ను కలిసినప్పటి ఫొటోలను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

నా స్వీట్ హార్ట్..

నా స్వీట్ హార్ట్..

నా స్వీట్ హార్ట్ ప్రభాస్‌కు అభినందనలు. ప్రభాస్ అందగాడే కాదు.. మానవత్వం ఉన్న వ్యక్తి. జై హో బాహుబలి అంటూ ప్రభాస్‌ను కలిసినప్పటి ఫోటోను ఇన్స్‌ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. బాహుబలి షూటింగ్‌లో రాజమౌళి, ప్రభాస్‌తో తన భార్య, కూతురు ఐశ్వర్య అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోను అర్జున్ షేర్ చేయడం గమనార్హం. అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కొన్ని ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం.

అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా..

అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా..

అర్జున్ కూతురు ఐశ్యర్య కూడా బాహుబలి టీమ్‌కు అభినందనలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొన్న బాహుబలి టీమ్‌కు కంగ్రాట్స్ అని ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. మరో ఫొటోలో రాజమౌళి, అర్జున్ ఆత్మీయంగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఈ ఫొటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో చాలా మంది లైక్, షేర్ చేయడం గమనార్హం.

ఆలస్యంగా వెలుగులోకి..

ఆలస్యంగా వెలుగులోకి..

బాహుబలి విడుదలకు ముందే అర్జున్ కుటుంబం చిత్ర యూనిట్ కలువడం చర్చనీయాంశమవుతున్నది. వారు చిత్ర యూనిట్ ఎందుకు కలిశారు. ఇన్నాళ్లు ఫొటోలను ఎందుకు షేర్ చేయలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్, అనుష్కలపై హంస నావపై డ్యూయెట్ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో అర్జున్ కుటుంబం కలిసినట్టు ఫొటోల ద్వారా స్పష్టమవుతున్నది.

1500 కోట్ల వైపు పరుగులు

1500 కోట్ల వైపు పరుగులు

కాగా, ఏప్రిల్ 28 తేదీన విడుదలైన బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తున్నది. భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లను సాధించి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. అదే ఊపుతో ఇప్పటివరకు 1200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. రూ.1500 కోట్ల మైలురాయిని అధిగమించేందుకు బాహుబలి పరుగులు పెడుతున్నది.

English summary
Actor Arjun Sarja shares never-seen-before Baahubali 2 on-set pictures, Says Prabhas a wonderful human being. Arjun Sarja and his family were among the few privileged people who had an opportunity to get the first-hand experience of witnessing the making of India’s biggest blockbuster, Baahubali: The Conclusion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu