»   » ఒంటికంటితో చూసేవాడి పాత్రకు జీవం పోయడానికి కారణం అదే..

ఒంటికంటితో చూసేవాడి పాత్రకు జీవం పోయడానికి కారణం అదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సినిమాలకు తన దర్శకత్వం ద్వారా ఓ కోత్త ఒరవడిని చూపించారు దర్శకుడు బాలా. సాధారణంగా దర్శకుడు బాలా ఏ విషయంలోనూ టెన్షన్ పడరు. ఆయనే నిర్మాతలను, నటీనటులను టెన్షన్‌కు గురి చేస్తారంటారు. అలాంటి బాలాను నటుడు విశాల్ టెన్షన్ పెట్టారట. అదేమిటో విశాల్ మాటల్లోనే విందాం. బాలా అవన ఇవన్ చిత్రంలో తనను హీరోగా ఎంపిక చేసినప్పుడు చాలా సంతోషించాను. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తరువాత యూనిట్ వేరే సన్నివేశం చిత్రీకరణకు సిద్ధం అవుతోంది.

దర్శకుడు బాలా మాత్రం అదే స్పాట్‌లో టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు. వెంటనే బాలా తనను పిలిచి 'నువ్వు ఇంకా చెన్నై కళాశాల విద్యార్థిలానే ఉన్నావు. అందులో నుంచి బయటపడాలి" అన్నారు. ఆ తరువాత ఒంటికంటితో చూసేవాడి పాత్రకు జీవం పోశాను. ఈ చిత్రం నాకు సరికొత్త అనుభవం. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో పూర్తి కమర్షియల్ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాను.

English summary
There's more news on Bala's Avan Ivan, which features Vishal, Arya, Janani Iyer and Madhushalini in the lead. Sources close to the unit of the film say that the unit has wrapped up shooting and that dubbing for the film is on. This means that the film is well on its way to being released sometime in April this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu