For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలా 'పరదేశి' పాటల విడుదల తేదీ

  By Srikanya
  |

  చెన్నై: శివపుత్రుడు, నేనే దేముడ్ని, వాడు వీడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన తమిళ దర్శకుడు బాలా. ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం పరదేశి. తెలుగులోనూ ఈ చిత్రం అదే టైటిల్ తో ముందుకు వస్తోంది. 'పరదేశి'లో అధర్వను సరికొత్త కోణంలో చూపిస్తున్న బాలా ఎప్పటిలానే ఇందులోనూ పాటలపై ప్రత్యేకదృష్టి సారించాడు. తన తొలి ఐదు సినిమాల సంగీత బాధ్యతల్ని ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్‌శంకర్‌ రాజాలకు అప్పగించిన బాలా ఆరో చిత్రానికి మాత్రం జి.వి.ప్రకాష్‌కుమార్‌ను ఎంచుకున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'పరదేశి' త్వరలోనే థియేటర్లలోకి రానుంది. 25న ఆడియోను చెన్నైలో ఆవిష్కరించనున్నారు. ఆడియో విడుదల ఆహ్వానపత్రికలో గాయకులకు కూడా సముచిత స్థానం కల్పించి వారి ఫొటోలను అచ్చు వేయించారు.

  తనకు కావాల్సిన బాణీలను రాబట్టుకోవటం దర్శకుడు బాలా ప్రత్యేకత. అగ్రనటులను సైతం చింపిరి దుస్తులతో చూపించి విజయాలు అందుకున్న ఆయన పాటలకూ అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. తొలిచిత్రం 'సేతు'లో 'ఎంగే సెల్లుం ఇంద పాదై..', 'నందా'లో 'మున్‌ పనియా ముదల్‌ మళైయా..', 'పితామగన్‌'లో'యలంకాత్తు వీసుదే...', 'నాన్‌ కడవుల్‌'లో 'పిచ్చై పాత్తిరం ఏందివందే..' తదితరమైనవి అద్భుత మ్యూజికల్‌ హిట్లుగా నిలిచాయి.

  ఈ చిత్రం తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఈ పోస్టర్ తిరగేసి ఉన్నట్లు ఉండి అందరికీ ఆశ్చర్యం కలుగ చేస్తోంది. అథర్వ, వేదిక ప్రధాన భూమికలు పోషించే ఈ చిత్రానికి స్క్రిప్ట్టుకు చక్కగా 'పరదేశి' టైటిల్ సరిపోతుందని అంటున్నారు. దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్‌ కాదవుల్‌' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్‌ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్‌ కాదవుల్‌' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది.

  నిజం చెప్పాలంటే మనమందరం పరదేశీలమే. బతకడానికి దారి లేక పుట్టిన గడ్డను వద లి వచ్చిన ప్రతి వాడు పరదేశీనే. ఇలా 1940లో ఒక టీ ఎస్టేట్‌లో బానిసలుగా వచ్చిన పరదేశీలలో ఒకడే అధర్వ. ఈ చిత్రానికి తొలుత అనుకున్న పేరు శని భగవాన్. మరీ భయంకరంగా ఉందని పరదేశీగా మార్చాం అంటున్నారు దర్శకుడు బాలా. ఆయన తన తాజా చిత్రం పరదేశి షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదల అవుతున్న సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  అలాగే రెడ్ టీ అనే నవలనే పరదేశీగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం ప్రస్దావిస్తే... ఆ నవలలోని ప్రధానాంశాన్ని మాత్రం తీసుకుని అందులో పరదేశి చేర్చి రూపొందిస్తున్నాను. వంద చిత్రాలతో పొందే అంతస్తును అధర్వ మూడవ చిత్రంతో పొందగలడని భావిస్తున్నాను. ఇందులో మీరు ఊహించని అంశాలే ఉంటా యి. నేను మినహా ఈ చిత్రంలో ఇంచుమించు అందరూ కొత్తవారే. కెమెరామెన్ సెళియన్ నుంచి ఎడిటర్ కిషోర్ వరకు అందరూ నూతన సాంకేతిక వర్గమే అన్నారు.

  దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్‌ కాదవుల్‌' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్‌ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్‌ కాదవుల్‌' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. పరదేశి చిత్రం రియల్ లైప్ ఇన్సిడెంట్స్ తో 1940నాటి కథతో జరుగుతోంది. అధర్వ మురళి హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం సాలూర్, మన్నముదురై, మున్నారు, తలైవార్ వంటి ప్రదేశాలల్లో షూటింగ్ జరిగింది. అక్కడ అటవీ ప్రాంతాలు, కేరళ లేని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ చేసారు.

  English summary
  Directed Bala’s much awaited film ‘Paradesi’ starring Atharva, Dhaniska and Vedika in the leads is all set to release its audio on the 25th of November 2012 (Sunday) at Sathyam Cinemas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X