చైన్నై : శివపుత్రుడు,నేనే దేముడ్ని,వాడు వీడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన తమిళ దర్శకుడు బాలా. ఆయన తాజాగా పరదేశి చిత్రంతో ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్స్ ని విడుదల చేసారు. అథర్వ, వేదిక ప్రధాన భూమికలు పోషించే ఈ చిత్రానికి స్క్రిప్ట్‌కు చక్కగా 'పరదేశి' టైటిల్ సరిపోతుందని అంటున్నారు. దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్ కాదవుల్' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్ కాదవుల్' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది.
ఇక పరదేశి చిత్రం రియల్ లైప్ ఇన్సిడెంట్స్ తో 1930నాటి కథతో జరుగుతోంది. అధర్వ మురళి హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం సాలూర్,మన్నముదురై,మున్నారు,తలైవార్ వంటి ప్రదేశాలల్లో షూటింగ్ జరిగింది. అక్కడ అటవీ ప్రాంతాలు,కేరళ లేని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ చేసారు. ఇక ఈ చిత్రం ఆడియో లండన్ లో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం ఆడియో విడుదల చేస్తారు. అక్టోబర్ రెండవ వారంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్యంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో సన్నివేశాలు చాలా భాగం వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ సాగుతాయి అంటున్నారు. అయితే సెన్సార్ వద్ద సమస్య వస్తుందా అన్న దానకి..తాను అవే సీన్స్ తెరపై చూపితే సెన్సార్ వారు కట్ చేసారని, అయితే పాపులర్ టీవీల్లో వాటిని చూపటం ఎంత వరకూ సమంజసం అంటున్నాడు. ఇక తన సినిమా ప్రొమోలు,పోస్టర్స్ చూసి ఫిక్స్ అయిన వారే వచ్చి చూస్తారని, అదే ఛానెల్ లో అయితే చిన్నా పెద్దా అనే తేడాలేకుండా చూస్తారని వివరిస్తున్నాడు. తను తీస్తే తప్పు అయింది..ఛానెల్ లో చూపితే తప్పు ఎందుకు కాదు అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాల్సిన పని ఉందని చెప్తున్నాడు.
Director Bala, who has made critically acclaimed and National Award winning films like Sethu, Nandha, Pithamagan, Naan Kadavul and Avan Ivan, is ready with his new film, Paradesi. The film is written, directed, and produced by Bala. Paradesi is based on the real life experiences of some people in the 1930s in India. Atharvaa Murali plays the protagonist, while Vedhika C Kumar and Dhanshikaa are the leading ladies. The film was shot in Salur and Manamadurai in Sivagangai district, Munnar and Talaiyar in Kerala , and the forest areas in Theni district.