»   »  ఇక్కడే ఫ్లాప్...మళ్ళీ తమిళంలోకా....

ఇక్కడే ఫ్లాప్...మళ్ళీ తమిళంలోకా....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhoomika
ఒక్కో పాత్ర నటులను ఎంతగా ప్రభావితం చేస్తుందంచే ఆ చిత్రం ఫ్లాపయినా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. తాజాగా అలాంటి కోరిక భూమికకు పుట్టిందిట. ఆమె ఆ మధ్య నటించిన 'సత్యభామ' లో షార్ట్ టైమ్ మెమరీ లాస్ పాత్ర ఆమెను ఇంకా వెంటాడుతోందిట. సినిమా రకరకాల కారణాలతో తెలుగులో వర్కవుట్ కాలేదనీ ఆమె అర్ధం చేసుకుని మళ్లీ తమిళ్ లో చేయాలనుకుంటోదిట. ఈ మధ్య సొంతంగా ఫ్రొడక్షన్ హౌస్ పెట్టిన దగ్గరనుండీ ఇలాంటి ఆలోచనులు వస్తున్నాయట.

అందులోనూ ఆమె భర్త భరత్ ఠాకూర్ కి ఆ సినిమాలో భూమిక పాత్ర అంటే చాలా ఇష్టంట. అంటే ఆయన కూడా భార్య కి మతిమరుపు ఉంటే బాగుండును అనుకున్నాడేమో గాని...తీద్దామని నిర్ణయానికి వచ్చాడట. ఇప్పటికే వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ హౌస్ ద్వారా 'అనసూయ' దర్శకుడు రవిబాబుతో 'దూరం' అనే సినిమా త్వరలో ప్రారంభించబోతోంది. ఛార్మి హీరోయిన్ గా అందులో చేస్తోందని తెలిసిందే. ఇప్పుడీ సత్యభామతో తమిళంలోకి వెళ్ధమనుకుంటోదన్నమాట.

అయినా అసలు సత్యభామ హాలీవుడ్ ఫిల్మ్ 'ఫిప్టీ ఫస్ట్ డేస్' కి పూర్తి స్ధాయి కాపీ. దాన్ని మొగుడు,పెళ్ళాం కలసి రకరకాల భాషల్లోకి తీసుకెళ్ళాలని అనుకోవటం వింతగా ఉందంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. అందుకేనేమే అదే ధైర్యంతో రీమేక్ రైట్స్ అవసరం ఉండవని తమిళంలోకి సత్యభామని తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నట్లున్నారు. అయినా తెలుగులోనే డిజాస్టర్ అయిన ఈ సినిమా తమిళంలో వర్కవుట్ అవుతుందా అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X