»   » ‘ఊపిరి’ : చివరి నిముషంలో కోర్టులో కేసు, నాగ్ ఆందోళన

‘ఊపిరి’ : చివరి నిముషంలో కోర్టులో కేసు, నాగ్ ఆందోళన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'మున్నా' సినిమాతో కెరీర్ ప్రారంభించి 'బృందావనం', 'ఎవడు' వంటి చిత్రాలతో స్టైలిష్ మేకర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ఊపిరి'.

నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పతాకంపై తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని రేపు విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ నేపధ్యంలో తమిళంలో ఈ చిత్రం రిలీజ్ పై సమస్యలు ఏర్పడ్డాయి. తమిళ వెర్షన తోజా పై కోర్టులో కేసు పడింది.


ఇదే టైటిల్ తో గతంలో అంటే 2008లో ఓ తమిళ చిత్రం వచ్చి రిలీజ్ అయ్యింది. ప్రేమ్ జీ అమరన్, విజయ్ వసంత్, నితిన్ సత్య , అజయ్ రాజ్ వంటి వారు నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా వర్కవుట్ కాలేదు.


అయితే ఈ చిత్రం నిర్మాత ఎన్.సుందరేశ్వరన్ అలియాస్ సుందర్ చెన్నై సివిల్ కోర్ట్ ని ఎప్రోచ్ అయ్యారు. ఆయన ఈ చిత్రం రిలీజ్ ని ఆపమని కోరారు. ఈ చిత్రం టైటిల్ పై తనకే రైట్స్ ఉన్నాయని, తన ఫర్మిషన్ తీసుకోకండా సినిమా టైటిల్ పెట్టారని ఆయన పిటీషన్ లో ప్రస్దావించారు.


కోర్టు..సుందర్ వేసిన ఈ పిటీషన్ ని స్వీకరించింది. ఈ రోజుకి హియిరింగ్ కు వస్తోంది. ఈ రోజు కనుక ఈ ఇష్యూ సాల్వ్ కాకుండా...కోర్టు వాయిదా వేస్తే కనుక రిలీజ్ కు సమస్య వస్తుందని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. అలాగే అక్కడ రిలీజ్ కోసం వెయిట్ చేస్తన్న నాగార్జున సైతం ఈ ఊహించని అవరోధానికి ఆందోళన పడుతున్నట్లు సమాచారం.


నాగ్ ఈ చిత్రం గురించి ఇంటర్వూ విశేషాలు


సిగ్గేసింది..అందుకే

సిగ్గేసింది..అందుకే

కార్తీ తెలుగు డైలాగులు నేర్చుకొని స్పష్టంగా పలికేవాడు. తనని చూస్తున్నప్పుడు నాకు సిగ్గేసేది. తమిళంలో ఈ సినిమాకి నేనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పాలన్నది కూడా కార్తి నిర్ణయమే.సినిమా మొత్తం

సినిమా మొత్తం

వీల్‌ ఛెయిర్‌ లోనే సినిమా ఆంతా నటించి, ఓ పేషెంట్‌ పాత్రలో అదరగోట్టి, తన వైవిధ్యాన్ని చాటుకుంటున్నాడు.సూర్యతో వున్నట్టే

సూర్యతో వున్నట్టే

కార్తీది, నాది మా ఇద్దరిదీ అన్నదమ్ముల అనుబంధం. కార్తీ,... సూర్యతో ఎలా ఉండేవాడో, నాతోనూ అలాగే ఉండేవాడు, అలాగే మాట్లాడేవాడు.అదే నియం

అదే నియం

‘‘చేసే సినిమా బాగుండాలి, అది ప్రేక్షకుడికి ఇంకా బాగా నచ్చాలన్నదే నా నియమం. అంతే తప్ప అంకెల్ని చూసుకొని... అది అంత వసూలు చేసింది కాబట్టి ఇది ఇంత చేయాలి అని ఆలోచించి నేనెప్పుడూ సినిమా చేయను. జీవితాంతం హీరోగానే ఉండాలని కూడా లేదు నాకు.నా కుటుంబ సభ్యులూ...

నా కుటుంబ సభ్యులూ...

‘మీరు వీల్‌ఛెయిర్‌లో కూర్చునే పాత్ర చేయడమేంటి?' అన్నారు. అమల ఇప్పటికీ భయపడుతోంది. కానీ సినిమా మొదలైన ఐదు నిమిషాలకే నేను వీల్‌ఛెయిర్‌లో ఉన్నానన్న విషయాన్ని మరిచిపోతారంతా''మరిత బాధ్యత

మరిత బాధ్యత

ఈ మధ్య నాకు వరుసగా మూడు విజయాలొచ్చాయి. మనం, సోగ్గాడే చిన్నినాయనా, మీలో ఎవరు కోటీశ్వరుడు. అందుకే మరింత బాధ్యతతో ఊపిరి చేసాను.


పోల్చడం

పోల్చడం

ఇప్పుడు చేస్తున్న సినిమాని గత సినిమాతో పోల్చి చూస్తుంటారు ప్రేక్షకులు, కానీ నా దృష్టిలో అలా పోల్చడం సరైనది కాదు.విభిన్నం

విభిన్నం

మేం చేసే ప్రతి సినిమా మాకు, ప్రేక్షకులకు విభిన్నం గా వుండలనే కోరుకుంటాం.ఆ కోణం

ఆ కోణం

ఏం సినిమా చేస్తున్నామో మేం ఆదే సినిమా కోణంలోనే చూస్తుంటాం, ప్రేక్షకులూ కూడా అలాగే చూడాలనుకుంటాను.నటుడిగా

నటుడిగా

వూపిరి సినిమా విషయంలో నేను నటుడిగా చాలా సంతృప్తిగా ఉన్నా


అలవాటు

అలవాటు

ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు లేదు.కొత్తగా

కొత్తగా

నటుడిగా ప్రయాణం ప్రారంభించిన నాటి నుండే ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నించేవాడిని.


అప్పట్లో...

అప్పట్లో...

తెలుగు సినిమా అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే మేకప్‌ చేసుకోవాలి, తెరపై ఇలాగే కనిపించాలని అందరూ చెప్పేవాళ్లు.ఫలితం లేదు

ఫలితం లేదు

కొన్ని తప్పని పరిస్థితుల్లో నేను పాత పద్దతినే ఫాలో అయ్యేవాడిని,అవి ఏమాత్రం సరైన ఫలితం ఇవ్వలేదు.


సొంత నిర్ణయాలు

సొంత నిర్ణయాలు

నా నుంచి ప్రేక్షకులు ఏదో కొత్తదనం కోరుకొంటున్నట్టు అనిపించేది. అందుకే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాను.


సోంత నిర్ణయమే

సోంత నిర్ణయమే

గీతాంజలి సుపర్ హిట్ అయింది. దానిని కేవలం నా సొంత నిర్ణయం మీద ఆదరపడి చేసిందే.సాహసం

సాహసం

అప్పట్లో ఏ హీరోలమీద ప్రేమకథలు తీసే పరిస్థితి లేదు. అందుకు నేను గీతాంజలి చేశా. అప్పట్లో కాలేజీ స్టూడెంట్స్ కోసం సినిమాలు చేసేనవాళ్లు లేరు, అందుకే అలా చేసా.నాసనం

నాసనం

గీతంజలి లో లేచిపోదాం...అనే డైలాగ్ విని తెలుగు భాషని నాశనం చేశానని, సమీక్షల్లో కూడా రాశారు కొద్దిమంది సినీ విమర్శకులు.భలే మంచి

భలే మంచి

సోగ్గాడే చిన్నినాయనా సినిమా లో భలే మంచి భాషని వాడారు, అచ్చమైన తెలుగు మాటలు వినిపించాయి, అనుకునేలా చేసారు.


నో ప్రయోగం

నో ప్రయోగం

నేనెప్పుడూ ప్రయోగాలు చేయను. ప్రయోగం పేరుతో సినిమాలు చేసే ఉద్దేశం కూడా నాకు లేదు.వ్యాపారం

వ్యాపారం

నా ప్రతి సినిమానీ వ్యాపారంగానే చూస్తుంటా. కానీ ప్రేక్షకులకు కూడా నచ్చలనే కోరుకుంటా.ప్రయోగం కాదు

ప్రయోగం కాదు

వూపిరి సినిమాలో నేను చేసిన పాత్రని ప్రయోగం అనడానికి వీల్లేదు. ఈ పాత్ర దొరకడం నా అదృష్టం.కింగ్‌లానే

కింగ్‌లానే

విక్రమాదిత్య అనే బిలియనీర్‌ అన్నమాట. వీల్‌ ఛెయిర్‌లో కూర్చున్న కింగ్‌లా కనిపిస్తుంటా. తనకి ఏం కావాలన్నా క్షణాల్లో జరిగిపోతుంటాయి.


సాయం

సాయం

బిలియనీర్‌కి, పేదింటి కుర్రాడికి మధ్య జరిగేదే ఊపిరి కథ. వాళ్లిద్దరూ ఒకరికొకరు ఎలా సాయం చేసుకొన్నారు? అనేదే ఆశక్తికరం


కేవలం

కేవలం

కాళ్లు చేతులు కదపకుండా కేవలం ముఖ కవళికలతోనే భావాలు పలికించడం ఎంత కష్టమో వూపిరి సినిమాతో అర్థమైంది.సవాల్

సవాల్

ఊపిరి సినిమాను ఒక సవాల్‌గా భావించి చేశా. నా కాళ్లని, చేతుల్ని గమనించడానికే ఇద్దరు వ్యక్తులు గమనించేవారు.


ఇరవై టేకులు

ఇరవై టేకులు

ఈ సినిమాలో కొన్ని కీలక సన్నీవేశాలకు ఇరవై టేకులు తీసుకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి.


ముందుగానే చెప్పా

ముందుగానే చెప్పా

ఊపిరిలో పాత్రని ఎప్పుడు చేయ లేదని, ఇదే మొదటిసారి కాబట్టి ఎంత టైం తీసుకొన్నా ఫర్వాలేదనీ, ఎన్ని టేకులైనా చేయగలనని నేను ముందే దర్శకుడికి చెప్పా.నటన రాదేమో

నటన రాదేమో

ఎక్కువ టేకులు తీసుకొన్న సందర్భాల్లో నాకు నటన రాదేమో అన్న సందేహం కూడా వచ్చేది. అంత క్లిష్టమైన పాత్ర నాది ఊపిరిలో.సంతృప్తి

సంతృప్తి

నటుడిగా నాకు ఈ ఊపిరి సినిమా బోలెడంత సంతృప్తినిచ్చింది. ఇందులో నన్ను చూసి దర్శకులు మరిన్ని విభిన్నమైన పాత్రలు సృష్టిస్తారనే నమ్మకం నాకుంది.ఆస్వాదిస్తున్నా

ఆస్వాదిస్తున్నా

కథని ప్రేమించి పనిచేస్తే తప్పకుండా ఫలితముంటుందని నమ్మా. ఇటీవల ప్రతి పాత్రనీ ఆస్వాదిస్తూ చేస్తున్నా. ఆ ప్రయత్నం మంచి ఫలితాల్ని ఇస్తోంది.తారక్ తో అనుకున్నా

తారక్ తో అనుకున్నా

‘‘మంచి కథలొస్తే తప్పకుండా మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తా. ఈ సినిమాని కూడా తారక్‌తో కలిసి చేయాలనుకొన్నాం. కానీ తన కాల్షీట్లు కుదర్లేదు. మల్టీస్టారర్‌ చిత్రాల్ని చేసేటప్పుడు కొన్ని విషయాల్ని పక్కన పెట్టేయాలి. నేరుగా పాత్రల్లోకి వెళ్లిపోవాలి.


నాకు డ్రీమ్ సాంగ్ వేయకూడదు

నాకు డ్రీమ్ సాంగ్ వేయకూడదు

‘వూపిరి'లాంటి సినిమా చేస్తున్నప్పుడు నేను కూర్చునే ఉండాలి... కార్తీ, తమన్నాలాంటివాళ్లు డ్యాన్స్‌ చేయాలి. నేనూ హీరోనే కాబట్టి... కళ్లు మూసుకొంటాను నాక్కూడా ఓ డ్రీమ్‌ సాంగ్‌ వేయండంటే సినిమానే చెడిపోతుంది.మొదట కష్టంగా

మొదట కష్టంగా

రెండు మూడు రోజులు సెట్‌లో నాకూ కష్టంగానే అనిపించింది. ‘వీళ్ల డ్యాన్సులేంటి? నన్నిలా కూర్చోబెట్టడమేంటి?' అనిపించేది (నవ్వుతూ). ఆ తర్వాత మళ్లీ నా పాత్రని గుర్తు చేసుకొనేవాణ్ని''.ప్రతీది సిక్సర్

ప్రతీది సిక్సర్

‘‘ఇక నుంచి చేసే ప్రతి సినిమా కూడా యువరాజ్‌ సింగ్‌ కొట్టే సిక్సర్‌లా ఉండాలనేది నా ఉద్దేశం. అందుకే ప్రతి సినిమా కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తున్నా.


ప్రయోగం కాదు..

ప్రయోగం కాదు..

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘శ్రీ నమో వెంకటేశ' చేస్తున్నా. ఆ సినిమాని కూడా సాహసోపేతమనో, ప్రయోగమనో నేను అనుకోవడం లేదు. ఇటీవల యువతరం మన మూలాల్ని తెలుసుకోవాలన్న తపనలో ఉన్నారు. ఆ లెక్కన ఆ సినిమాకి ప్రేక్షకులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారన్న విషయం అర్థమైపోతుంది.


పరిశోధన జరుగుతోంది

పరిశోధన జరుగుతోంది

హథీరాం బాబా పాత్రలో నేను నటిస్తున్నా. ఆ పాత్ర ఎలా ఉంటుందో సరైన ఆధారాలు లేవు. అందుకే కె.రాఘవేంద్రరావుగారు ఎంతో పరిశోధన చేస్తూ సినిమాని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.


ఈలోగా..

ఈలోగా..

ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరో రెండు నెలలైనా పడుతుంది. ఈలోపు అఖిల్‌, నాగచైతన్యల సినిమాల గురించి ఆలోచించాలి.ఓ రీమేక్

ఓ రీమేక్

అఖిల్‌ కోసం రెండు స్ట్రెయిట్‌ కథలు, ఒక హిందీ రీమేక్‌ కథలు పరిశీలనలో ఉన్నాయి.


నా కనుసన్నల్లో..

నా కనుసన్నల్లో..

వంశీ పైడిపల్లితో కూర్చుని మాట్లాడుతున్నాడు. అయితే ఈసారి అఖిల్‌ సినిమా వ్యవహారాలన్నీ నా కనుసన్నల్లోనే జరుగుతాయి. అసలేమాత్రం తొందరపడకుండా నిర్ణయం తీసుకొందామని చెప్పా''.English summary
producer N.Sundareshwaran alias Sundar has approached a Civil Court in Chennai. He has pleased the release of 'Thozha'(oopiri) should be stopped as he holds the rights over the title and the
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu