»   »  హీరో విక్రమ్ కి తండ్రే విలన్!!

హీరో విక్రమ్ కి తండ్రే విలన్!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vikram
'అపరిచితుడు' విక్రమ్ తండ్రి వినోద్ ప్రొపషనల్ యాక్టర్ కాకపోయినా గతంలో త్రిష తండ్రిగా 'గిల్లి'(ఒక్కడు రీమేక్)లో కనిపించాడు. అప్పటినుంచీ పలు చిత్రాల్లో అడపాదడపా వేషాలు వేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం తన కొడుకు విక్రమ్ చిత్రం మల్లన్న(తమిళ కందసామి)లో ఆయన విలన్ గా కనిపించనున్నాడు. విక్రమ్ ఈ సినిమాలో విలన్ గా ఉన్న తన తండ్రి తో వీరోచితంతగా పోరాడే సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఈ సన్నివేశాలు ఈ మధ్యనే చెన్నైలో చిత్రీకరించారు. నిజ జీవితంలో స్నేహితులుగా మెలిగే వీరిద్దరూ ఒకే చిత్రంలో ఆపోజిట్ రోల్స్ కనపడటం తమిళ చిత్రం సీమలో సంచలన వార్త అయింది. అలాగే సుసీ గణేషన్ దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా కనిపించనున్నది. తెలుగులోనూ వైవియస్ చౌదరి దర్శకత్వంలో రానున్న సలీం...దుమ్మురేపుతాడులో కూడా తండ్రి కొడకులు(మోహనబాబు,విష్ణవర్ధన్ బాబు)హీరో విలన్స్ గా కనపడటం చెప్పుకోతగ్గ అంశం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X