»   » 'బిల్లా' సినిమాను మించే స్పీడు స్క్రీన్ ప్లేతో...

'బిల్లా' సినిమాను మించే స్పీడు స్క్రీన్ ప్లేతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అజిత్‌ తాజా చిత్రం 'ఆరంభం' గతంలో వచ్చిన 'బిల్లా'ను మించిన వేగంతో ఉంటుందని దర్శకుడు విష్ణువర్ధన్‌ పేర్కొంటున్నాడు. అజిత్‌కు జంటగా నయనతార నటిస్తుండగా, మరో జంటగా ఆర్య-తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా అజిత్ కెరీర్ లో పెద్ద హిట్ నమోదు చేస్తుందని హామీ ఇస్తున్నాడు.

విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. 'బిల్లా'లాంటి మెగాహిట్‌ తర్వాత అజిత్‌తో మరోసారి పని చేయటం ఆనందంగా ఉంది. 'మంగాత్తా'లో సగానికి పైగా నెరసిన వెంట్రుకలతో కనిపించిన అజిత్‌ ఇందులోనూ అదే గెటప్‌లో అలరించనున్నాడు. అలా చూపాలని మా యూనిట్‌ ముందుగానే అనుకుంది. వెంకట్‌ ప్రభు మాకన్నా వేగంగా స్పందించి 'మంగాత్తా'లో ఆ క్రెడిట్‌ కొట్టేశాడు. 'ఆరంభం' ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ప్లేలో 'బిల్లా'ను మించే వేగం ఉంటుంది. తమిళ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందని వివరించాడు.

ఈ చిత్రంలో అజిత్..సైబర్ క్రైమ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. కథలో భాగంగా ఆయన సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎక్కౌంట్ లు హ్యాక్ చేస్తాడు. అప్పుడు కొన్ని విషయాలు బయిటపడతాయి. ఆ దిసగా ధర్వాప్తు ప్రారంభిస్తాడు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే దిసగా సినిమా నడుస్తుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది.


హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న స్టార్ హీరో అజిత్‌. ఆయన సినిమాకు కొబ్బరికాయ కొట్టినా పండగే, పేరు పెట్టినా సంబరమే. ఆడియో విడుదలైతే కోలాహలం. ఇక థియేటర్లలోకి వస్తే జాతరే! 'బిల్లా-2' తర్వాత అజిత్‌ రెండు చిత్రాల్లో వరుసగా నటిస్తున్నారు.

ఈ చిత్రం కోసం రకరకాల లొకేషన్స్ ని దర్శకుడు హంట్ చేసి మరీ పట్టుకున్నారు. బెంగుళూరు, ఒరిస్సా, దుబాయిలలో ఎక్కువ భాగం షూట్ చేసారు. ఈ చిత్రంపై అజిత్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. సినిమా మంచి విజయం సాధిస్తుంద ని నిర్మాతలు సైతం అంటున్నారు.

English summary
Director Vishnuvardhan says...' Iam glad with the over whelming response i received for the title , the delay was unintentional , but we are glad that in a way that delay also increased the hype around the movie. Ajith plays the central character with an characterization of a valiant warrior. Arya and Nayanthara play important characters that circle around Ajith. Ajith sir is on his popular salt and pepper get up of 'Mankaatha'. In fact i had requested Ajith sir to introduce that get up in my film only but Venkat prabhu over took me and the rest was history .This look suits Ajith sir so well and i honestly believe no body can match him in this style...This is an action drama, pacy and racy script. It will be much faster than our earlier film together Billa. This film will be an absolute entertainer , not only to Ajith sir's fans but also to classes and masses alike'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu