»   » ప్రాణభయంతో పరుగులు తీసిన 'ప్రేమిస్తే' సంధ్య

ప్రాణభయంతో పరుగులు తీసిన 'ప్రేమిస్తే' సంధ్య

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చెన్నై : షూటింగ్ జరుగుతున్నప్పుడు విలన్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నటి సంధ్యకు మరో ప్రమాదం ఎదురైంది. ఎలాగోలా అందులో నుంచి బయటపడింది. 'ప్రేమిస్తే'లాంటి సున్నితమైన ప్రేమకథతో ఆమె తెరంగేట్రం చేసింది. విజయవంతమవటంతో 'ప్రేమిస్తే' సంధ్యగా స్థిరపడిపోయింది. అనంతరం ఆశించిన అవకాశాలు లభించక పోటీలో వెనుకపడిపోయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'మాయై'. వన్‌సైడ్‌ ప్రేమ కారణంగా ఏర్పడే అనర్థాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 'నేను దేముడ్ని‌'లో విలన్ పాత్ర పోషించిన రాజేంద్రన్‌ ఇందులో సైకో విలన్‌గా భయపెట్టనున్నాడు.

  కథ ప్రకారం సంధ్యను ప్రేమించే ఇతను ఆమెను అపహరించి అడవిలో బంధిస్తాడు. ఇతని కళ్లుగప్పి తప్పించుకునే సన్నివేశాల్ని ఇటీవల చిత్రీకరించారట. అందులో భాగంగా సంధ్య పరుగులు పెడుతుండగా ఎదురుగా గజరాజుల గుంపు ఎదురైందట. భయంతో బెంబేలిత్తిన ఆమె మరింత వేగంగా గుట్టల్లోకి వెళ్లిపోయి ప్రాణాలు రక్షించుకుందట. అనంతరం ఏనుగులు అక్కడి నుంచి వెళ్లాక బయటకొచ్చిందట. ఈ విషయం ఆమె మీడియాతో పంచుకుంటూ ప్రాణాలు పోయినంత పనైందని అని అంది. నిజజీవితంలో అంత భయానిక సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది.

  ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ గా, అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన 'సంధ్య' న్యూడ్ గా నటించేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. తమిళంలో దీపన్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'మాజై కాలమ్' అనే చిత్రానికి గాను....పాత్ర డిమాండ్ మేరకు ఓ సీన్లో అమ్మడు నూలు పోగు లేకుండా నటించేందుకు ఒప్పుకుందని సమాచారం.

  ఈ సినిమా కథ కాలేజ్ ఆప్ ఆర్ట్స్ చుట్టూ తిరుగుతుందని, కథలో భాగంగా చిత్రకారుడు వేసే పేయింటింగ్ కోసం ఆమె న్యూడ్ గా ఫోజు ఇవ్వాల్సి వస్తుందని, అందులో భాగంగానే సంధ్య ను అడగ్గా....ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెబుతున్నారు. సంధ్య కంటే ముందు పలువురు పెద్ద హీరోయిన్లను సంప్రదించినా వారు న్యూడ్ గా నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.

  మరో ప్రక్క ఇదివరకు 'అల్లరే అల్లరి', 'రామ్‌దేవ్' వంటి చిత్రాల్ని నిర్మించిన ఎస్‌కె. బషీద్ తాజాగా ఎస్.బి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఫైర్'. ఈ చిత్రంలోనూ సంధ్య కీలకమైన పాత్రను చేస్తోంది.

  English summary
  Tami cute beauty Premisthe Sandhya became famous after her entry into Tamil movie Kadhal Which made her to receive film fare awards 2004 best actress award. During the Shooting of Tamil new movie Maayai in which she is acting as a heroine . There was a scene in which they had to move in forest. Elephants are going to attack on her. All her fans were shocked to hear the news.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more