»   » సారీ...హాస్య నటుడు గౌండమణి మరణించలేదు...

సారీ...హాస్య నటుడు గౌండమణి మరణించలేదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో ప్రముఖ కమెడియన్ గౌండమణి గురువారంనాడు మరణించినట్టు అంతటా వార్తలు గుప్పుమన్నాయి. అయితే వార్తల్లో నిజం లేదని తేలింది. రెండ్రోజుల క్రితం ఆయనకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ లోగా గౌండమణి తీవ్రమైన గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్టు స్కోరింగ్ లు ఇంటర్నెట్ లో వార్తలు వచ్చాయి. అంతేగాక వికీ పేజీలో సైతం ఈ మరణ వార్తను నమోదు చేసారు. దాంతో ఆయన అభిమానులు ఉలిక్కిపడి పత్రికా కార్యాలయాలకు, గౌండమణి సంబంధీకులకు ఫోన్లు చేయసాగారు. దాంతో మీడియావారు నాలుక్కరుచుకుని...ఆయన మరణించారనే వార్తలు కేవలం రూమర్స్ అనీ, ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారనీ శుక్రవారంనాడు ప్రకటన చేసారు. గౌండమణి మరణించినట్టు వికీ పేజ్ లో బయట నుంచి పోస్ట్ చేసిన ఓ వార్తను కూడా ఆ తదుపరి తొలగించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu