»   » 'హన్సిక జీ' అంటూ పిలుస్తున్న హీరో

'హన్సిక జీ' అంటూ పిలుస్తున్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : హన్సిక ని ఏవండి..జీ అంటూ హీరోలు సంభోదిస్తారా అంటే పిలుస్తున్నాంటున్నాడు తమిళ హీరో శివకార్తికేయన్. తనతో నటిస్తున్న హీరోయిన్ హన్సికను ఎంతో గౌరవంగా 'హన్సిక జీ' అని పిలుస్తున్నాడట. దీనిపై శివకార్తికేయన్‌ వివరణ ఇస్తూ.. ''నేను తెరపైకి వచ్చిన ఒకట్రెండేళ్లే అవుతోంది. కానీ హన్సిక బాలనటి. చిన్నతనం నుంచే ఆమె సినీ పరిశ్రమలో ఉన్నారు. అందువల్లే ఆమెను గౌరవంగా పిలుస్తున్నాను''అని చెప్పాడు. తనను జీ అంటూ సంబోధించొద్దని హన్సిక చెప్పినా కూడా వినిపించుకోవడం లేదట శివ.

యంగ్ హీరోల్లో హవా చాటుతున్నాడు శివకార్తికేయన్‌. 'కేడీబిల్లా కిలాడి రంగా', 'నీర్‌పరవై', 'వరుత్తపడాద వాలిబర్‌ సంఘం'.. చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టిన ఈ హీరో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్‌ అందాలతారగా అభిమానులను సంపాదించుకున్న హన్సికతో కలిసి నటిస్తున్నాడు. ఏఆర్‌ మురుగదాస్‌ కథ, స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రానికి 'మాన్‌ కరాటే' అని పేరు పెట్టారు. పి.మదన్‌ నిర్మాత. రూ.35 కోట్లతో నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇప్పటికే నాగచైతన్య, మంచు విష్ణుతో మరో రెండు చిత్రాలకు కమిట్ అయింది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.సుందర్.సి దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కూడా సిద్ధమైంది. ఇవన్నీ చూస్తుంటే గతంలో చెప్పినట్టుగా పెళ్లిచేసుకొని వెళ్లిపోయే ఆలోచన వాయిదా వేసినట్లు కనపడుతోంది. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు చేసుకుంటూ వెళితే మరో రెండు సంవత్సరాలన్నా సరిపోతాయి. మొత్తానికి పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.

English summary
Sivakarthikeyan and Hansika, who are working together in Maan Karate, have been bonding big time on the sets. Siva says, "She's a professional, and is like a livewire on the sets. She is friendly and bonds well with everyone. I really enjoy shooting with Hansika." Given that both of them have a good sense of humour, quiz Siva if they pull pranks on each other, and he laughs, "Not pranks, but we pull each other's legs while we are giving our shots. I call her Hansikaji because she's been acting right from her childhood, and in a way, is my senior."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu