»   »  హన్సిక... అమ్మకానికి పెట్టింది

హన్సిక... అమ్మకానికి పెట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇన్నాళ్లూ మనకు నటిగానే తెలిసిన హన్సిలో మరో యాంగిల్ ఉంది. అది ఆమె ఓ చక్కని పెయింటర్ కూడా. షూటింగ్ లకు మాత్రమే కొంత సమయాన్ని తనలోని కళాతృష్ణకు కేటాయిస్తూ తన ఊహలకు రూపాలనిస్తూ చక్కని చిత్రలేఖనాలను గీస్తుంటారు. ఇప్పుడు ఆమె తను గీసిన చిత్రాలను అమ్మకానికి పెట్టింది. ఆమె అభిమానులు వాటిని కొంటారని ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇక తనలోని ఈ చిత్ర లేఖని విద్యని హన్సిక ..హ్యూమన్ యాంగిల్ ఉపయోగించనుంది. ఎన్నో పెయింటింగ్స్ రూపొందించిన హన్సిక వాటినిప్పుడు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా వచ్చిన డబ్బును అనాథాశ్ర మాలకు అందించనున్నట్లు వెల్లడించారు. అంతే కాదు ఇటీవల తమిళనాడులో వరద బాధితులకు హన్సిక తన వంతు సాయం అందించారన్నది తెలిసిన విషయమే.

తన ప్రతి పుట్టినరోజున ఒక అనాథ పిల్లని దత్తత తీసుకుంటూ వారి సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. వారి కోసం ముంబైలో ఒక ఆశ్రమాన్ని కూడా కట్టించారు. ఇప్పటికే 20 మందికి పైగా అనాథులను అక్కున చేర్చుకున్న హన్సిక షూటింగ్ ఖాళీ సమయాల్లో వారితో గడుపుతూ ఆ పిల్లల్లో నూతనోత్సాహాన్ని కలిగిస్తుంటారు.

Hansika paintings for sale

ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న హన్సిక...ప్రముఖ దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో నటించిన త్వరలో విడుదల కానున్న అరణ్మణై-2 చిత్ర రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

సిద్దార్ద, హన్సిక కాంబినేషన్ లో రూపొందిన 'అరణ్మనై 2' చిత్రం తెలుగులో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో సర్వాంత్రం క్రియేషన్స్ - గుడ్ సినిమా గ్రూప్ వారు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'కళావతి' పేరును ఖరారు చేసి ట్రైలర్ వదిలారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

తమిళ్ లో సుందర్.సి దర్శకుడిగా తెరకెక్కించిన హారర్ చిత్రం 'అరణ్మనై' .. చిత్రం గతంలో తెలుగులో 'చంద్రకళ' పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దాంతో అదే ఉత్సాహంతో ఈ దర్శకుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'అరణ్మనై 2' ను రూపొందించాడు. ఇప్పుడు ఈ సినిమాని ఇలా రిలీజ్ చేస్తున్నారు.

English summary
Hansika to raise funds for adopted children she kept her paintings for sale.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu