»   » ముష్టిదాని చెయ్యపట్టుకున్నాడంటూ హీరోని కొట్టారు

ముష్టిదాని చెయ్యపట్టుకున్నాడంటూ హీరోని కొట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గాంధీ కనక్కు అనే తమిళ చిత్రంలో హీరో ఓ ముష్టి ఆమెతో ప్రేమలో పడతాడు. రమణ(తెలుగలో కొన్ని చిత్రాలు చేసాడు) హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో రిచా సిన్హ హీరోయిన్ గా ముస్టిదానిలా చేస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా చెన్నై రోడ్లపై జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె వీధిలో ముస్టి అడుక్కూంటే..హీరో వెళ్ళి బిర్యాని పాకెట్ దానం చేస్తాడు. ఈ సీన్ సహజంగా రావాలని దూరంగా కెమెరా పెట్టి తీస్తున్నారు. ఇక ఈ విషయం గమనించిన జనం ఓ ముస్టి దానికి బిర్యాని ప్యాకెట్ ఇచ్చి ఎవరో ఓ వ్యక్తి లోబరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడనుకుని చుట్టు ముట్టారు. అంతటితో ఆగక ఆ హీరోకి దేహ శుద్ది చేసే ప్రయత్నంలో పడ్డారు. అదే సమయానికి దర్సకుడు, కెమెరామెన్ పరుగెత్తుకు వచ్చి విషయం ఏం జరిగిందో తెలుసుకునే లోపల జనం విరగపడి తంతున్నారు. యూనట్ సభ్యులంతా కలిసి అది షూటింగ్ అని వారిద్దరూ హీరో, హీరోయిన్స్ అని నచ్చ చెప్పేసరికి చాలా సేపు పట్టింది. అదీ ఈ ముస్టి లవ్ స్టోరి వ్యవహారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu