»   » తమిళ హీరో అజిత్‌కు గాయాలు...ఆస్పత్రికి తరలింపు

తమిళ హీరో అజిత్‌కు గాయాలు...ఆస్పత్రికి తరలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : షూటింగ్ సమయంలో అజిత్‌ గాయపడ్డారు. ఆయన హీరోగా నటిస్తున్న 56వ సినిమా షూటింగ్‌ చెన్నై, సమీప ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో అజిత్‌ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. దరువు దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్‌కు చెల్లెలిగా లక్ష్మీమేనన్‌ నటిస్తోంది.

చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో ఫైట్ సీన్స్ ను చిత్రీకరించారు. ఆ సమయంలో అజిత్‌ కిందపడి కుడికాలికి గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన తర్వాత మళ్లీ షూటింగ్ లో పాలుపంచుకున్నారు.

Injured Ajith Shoots Despite Pain

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విషయానికి వస్తే....

తమిళ సూపర్ స్టార్ అజిత్ వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు..ఎన్నై అరిందాల్ కంటే ముందు అజిత్, సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో వీరమ్ అనే సినిమా చేశాడు..ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్ద హిట్ అయింది..దీంతో ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది..ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ అజిత్ తో జోడి కట్టబోతోంది.

అయితే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కనుందట అందుకు అజిత్ కు చెల్లిలుగా ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి.. అందులో బిందు మాధవి, నిత్య మీనన్ పేర్లు ముఖ్యమైనవి. ఫైనల్ గా ఈ పాత్రకు కోలీవుడ్ బొద్దుగుమ్మ లక్ష్మీ మీనన్ ఫైనల్ అయ్యింది..లక్ష్మీ మీనన్ కోలీవుడ్ లో హీరోయిన్ గా బాగానే రాణిస్తోంది.

లక్ష్మీ ఇంతకు ముందు విశాల్ సరసన 'పల్నాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందకు వచ్చింది. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ కార్తీతో పాటు గౌతమ్ కార్తిక్ సినిమాలలో నటిస్తోంది. హీరోయిన్ గా మాంచి ఫామ్ లో ఉన్న లక్ష్మీ ఇప్పుడు సడెన్ గా అజిత్ కు చెల్లెలిగా నటిస్తోందని వినిపిస్తోంది.

అజిత్ స్టార్ హీరో కాబట్టి ఈ ఆఫర్ ను మిప్ చేసుకోదని లక్ష్మీ మీనన్ భావించిందట. మరో వైపు అజిత్ కు చెల్లెలిగా అమ్మడు ఒప్పుకుందంటే ఆ పాత్ర కు ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందో అర్థం అవుతందంటున్నారు కోలీవుడ్ జనం. ఏదేమైనా హీరోయిన్ గా దూసుకుపోతున్న లక్ష్మీ మీనన్ కెరీర్ పై ఈ సినిమా ప్రభావం చూపుదంటంటున్నారు.

English summary
Ajith had suffered an injury on the sets of his forthcoming Tamil movie, which is presently called by the name "Thala 56". But despite the injury, the actor took part in the shooting and helped the film's unit complete the shooting as per plan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu