Niddhi Agerwal స్టార్ హీరోతో సహజీవనం.. త్వరలోనే పెళ్లి బాజాలు.. ఆ యువ హీరో ఎవరంటే?
సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య అఫైర్లు, డేటింగ్, సహ జీవనం ఇటీవల కాలంలో కొత్తేమీ కాదు. సినీ తారలు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడమో లేదా.. బ్రేకప్స్ చెప్పుకోవడం సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రేమ జంట వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమౌతున్నది. ఆ ప్రేమ జంట ఎవరో కాదు.. నిత్య ప్రేమికుడు శింబు, యువ హీరోయిన్ నిధి అగర్వాల్. వీరిద్దరి డేటింగ్ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శింబు, నిధి అఫైర్ విషయంలోకి వెళితే.
Recommended Video

నయనతార, హన్సికతో శింబు అఫైర్లు
తమిళ చిత్ర పరిశ్రమలో శింబు అఫైర్ల గురించి బోలెడంత చరిత్ర ఉంది. మొదట నయనతారతో పీకల్లోతూ మునిగిపోయారు. పెళ్లి వరకు వచ్చిన వీరి కహాని.. ప్రేమ వద్దే ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక మోత్వానితో చాలా కాలం డేటింగ్ చేశారు. వారిద్దరూ సహజీవనం కూడా చేశారనే విషయం మీడియాలో వినిపించింది. అయితే హన్సికతో కూడా అఫైర్ వర్కవుట్ కాలేకపోయింది.

త్రిషతో పెళ్లి అంటూ వార్తలు
అయితే వరుస ఫ్లాప్‌లతో చాలాకాలంగా సినిమాలకు దూరమైన తన అఫైర్ల జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల కాలంలో త్రిషతో అఫైర్ కూడా మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే త్రిషతో తన పెళ్లికి తండ్రి, నటుడు, దర్శకుడు టీ రాజేందర్ అడ్డుపడ్డారనే విషయం మీడియాలో గందరగోళంగా మారింది. దాంతో త్రిషతో శింబు వ్యవహారం బెడిసికొట్టిందని మీడియా వర్గాలు చెప్పుకొన్నాయి.

ఈశ్వరన్ మూవీ సమయంలో అఫైర్
ఇదిలా ఉండగా, శింబు మరోసారి నిధి అగర్వాల్‌తో ప్రేమలో పడ్డారనే విషయం తమిళ సినీ పరిశ్రమలో కోడైకూస్తున్నది. శింబు నటించిన ఈశ్వరన్ సినిమా షూటింగ్ సమయంలో నిధి అగర్వాల్‌తో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి శింబు, నిధి జంట విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

చెన్నైలో సహజీవనం అంటూ
గత రెండేళ్లుగా నిధి అగర్వాల్, శింబు అఫైర్‌కు ముగింపు కార్డు పడే సమయం వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. శింబు, నిధి అర్వాల్ ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే వారిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు తమిళ మీడియాలో వార్త వైరల్ అవుతున్నది.

స్పందించని శింబు, నిధి
అయితే పెళ్లి వార్తపై గానీ, అఫైర్ గురించి గానీ శింబు, నిధి అగర్వాల్ పెదవి విప్పడం లేదు. వారు తమ రిలేషన్ గురించి గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అయితే శింబు, నిధి సన్నిహితులు మాత్రం పెళ్లి వార్తలో ఎలాంటి నిజం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లు మాత్రమే అంటూ కొట్టిపడేశారు. అయితే ఈ వార్తలపై ఈ ప్రేమ జంట స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

భారీ సక్సెస్‌తో శింబు జోష్
ఇదిలా ఉండగా, మన్నాడు చిత్రంతో శింబు భారీ సక్సెస్ అందుకొన్నాడు. సురేష్ కమాచీ నిర్మాతగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన సినిమా శింబుకు మంచి విజయాన్ని అందించారు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, ఎస్‌జే సూర్య నటించారు. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











