»   »  రామ్ చరణ్ సినిమా,బెంగాళ్ రీమేక్ గా, భారీ రేటుకే

రామ్ చరణ్ సినిమా,బెంగాళ్ రీమేక్ గా, భారీ రేటుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:తమిళంలో క్రితం సంవత్సరం (2015) ఆగష్టు 28న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా 'తని ఒరువన్'. జయం రవి హీరోగా అలనాటి స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇప్పటకే తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ అవుతోంది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా హైదరాబాద్ లో జరుగుతోంది.

అది పక్కన పెడితే ఈ సినిమా రీమేక్ పై బెంగాళీలు సైతం అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. రీసెంట్ గా బెంగాళి హీరో జీత్ 'తని ఒరువన్' సినిమా చూసారు. జీత్ కి సినిమా బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమా రీమేక్ పై అత్యంత ఆసక్తి కబరచటంతో సినిమా రీమేక్ కు రంగం రెడీ అయ్యింది.

కార్పోరేట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న మోసాలను అరికట్టడమే పనిగా పెట్టుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ 'తని ఒరువన్'. ఇప్పటికే పలు సార్లు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన జీత్ కి ఈ కథ బాగా సెట్ అవుతుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం భారీ గా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.

Jayam Ravi's 'Thani Oruvan' To Be Remade In Bengali!

తని ఒరువన్' కూడా తమిళనాట బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసిన కథ. కేవలం 20 కోట్ల ఖర్చుతో తయారైన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ టేకింగ్‌తో అందరినీ పడేసింది.

ఈ సినిమా కథేమిటంటే... నగరంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రొబేషన్‌లో ఉన్న ఐ.పి.ఎస్. ఆఫీసర్ అయిన హీరో, అతని మిత్ర బృందం రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నిస్తారు. తీరా తాము ప్రాణాల్ని పణంగా పెట్టి పట్టుకొన్న నేరస్థులు కాస్తా వ్యవస్థలోని లోపాల కారణంగా శిక్ష లేకుండా బయటపడడం వారికి బాధ కలిగిస్తుంది.

హీరో రహస్యంగా దర్యాప్తు చేసి, నగరంలోని చిన్న నేరాలన్నీ ఒక భారీ కుట్రకు మూలమని గ్రహిస్తాడు. ఆ భారీ కుట్ర వెనుక ఉన్న అసలు నేరస్థుణ్ణి కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు.

సమాజంలోని పేరున్న వాడూ, 'పద్మశ్రీ' పురస్కార గ్రహీత అయిన ఓ సైంటిస్ట్ ఔషధాల రంగంలోని అతి పెద్ద కుట్రకు సూత్రధారి అని హీరో కనిపెడతాడు. రియల్ ఎస్టేట్, ఖనిజాల మాఫియాలో కూడా హస్తం ఉన్న ఆ తెలివైన సైంటిస్ట్ విలన్‌కూ, ఈ పోలీసా ఫీసర్ హీరోకూ మధ్య జరిగే ఎత్తులు పెయైత్తుల చదరంగమే మిగతా కథ.

English summary
Actors Jeet and Prosenjit Chatterjee are reportedly teaming up for yet-untitled Bengali remake of last year's Tamil blockbuster Thani Oruvan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu