»   » జ్యోతిక రీ ఎంట్రీ ఖరారు

జ్యోతిక రీ ఎంట్రీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : రవితేజ సరసన షాక్ లో నటించిన జ్యోతిక ..వివాహానంతరం వెండి తెరకు దూరమైంది. అయితే ఆమె త్వరలో రీఎంట్రీ ఇవ్వనుంది. ఇన్నాళ్లూ పిల్లలు పెద్దవాళ్లు కాలేదని ఆగిన జ్యోతిక తన భర్త అనుమతితో ...తన ఖాళీ సమయాన్ని రీ ఎంట్రీతో సద్వినియోగం చేసుకోనుంది.

ఎస్‌జే సూర్య దర్శకత్వంలో అజిత్‌ ప్రధానపాత్ర పోషించిన 'వాలి' ద్వారా తమిళతెరకు పరిచయమైన జ్యోతిక. కమల్‌హాసన్‌, విజయ్‌, సూర్య, శింబు వంటి పలువురు స్టార్ హీరోల సరసన కనిపించి గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌ 'చంద్రముఖి'లో కీలకపాత్ర పోషించింది.

ఆ తర్వాత రెండు చిత్రాల్లో మాత్రమే నటించింది. నటుడు సూర్యను ప్రేమించిన అమ్మడు.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితానికి పరిమితమైంది. అడపాదడపా ఇద్దరూ కలసి కొన్ని ప్రకటనల్లో నటించారు. అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చిన జ్యోతిక మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇందుకు సంబంధించి సూర్యతో చర్చించగా ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. గతంలోలా డ్యూయెట్లు, పూర్తిస్థాయి హీరోయిన్ గా కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని నిర్ణయించుకుందట జ్యోతిక.

English summary
Even Sridevi is said to be making a come back with a film with Kamal Haasan. So it will not be a big surprise if Jyothika too makes a comeback. She has the full support of her husband Surya. Surya said this in so many words recently while speaking to the reporters. He said that the decision to make a comeback rests entirely on Jyothika. And he has no objection whatsoever over this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu