»   » కమల్ హాసన్, త్రిషల 'మన్మధన్ అంబు' కధేంటి?

కమల్ హాసన్, త్రిషల 'మన్మధన్ అంబు' కధేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్, త్రిష కాంబినేషన్ లో మన్మధన్ అంబు అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషిస్తున్నారు. కథ ప్రకారం గోపాల్ (మాధవన్)..ప్రముఖ నటి అంబుజం(త్రిష)తో ప్రేమలో ఉంటాడు. అయితే ఆమె ముందు అది ఎక్సప్రెస్ చేయటానికి భయపడుతూంటాడు. ఆమె తనతో ప్రేమలో ఉందో లేదో తెలుసుకున్న తర్వాతే ఐలవ్ యు చెప్దామని డిసైడ్ అవుతాడు. ఆ ధిసగా అడుగులు వేయటానికి కమల్ హాసన్ ని డిటెక్టివ్ గా పెట్టుకుంటాడు. అక్కడ నుంచి కమల్ హాసన్..త్రిషను షూటింగ్ లలో ఫాలో చేస్తూ స్నేహం చేస్తాడు. ఆ విషయం కమల్ హాసన్ ప్రేయసి సంగీత కి తెలియక అపార్దాలు చోటు చేసుకుంటాయి.ఈ చిక్కు ముడులన్నిటినీ మాధవన్ ఎలా విడతీసి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది కామిడీగా చెప్తున్నారు. ఇక తమిళ హీరో సూర్య ఈ చిత్రంలో త్రిష సరసన ఓ పాటలో కనపడతాడు. అలాగే త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఈ చిత్రంలో కీరోల్ చేస్తోంది. కామిడీతో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్సకత్వంలో రూపొందుతోంది. ఇంతకుముందు దశావతారం, తెనాలి, పంచతంత్ర వంటి చిత్రాలకు కమల్, రవి కుమార్ కలిసి పనిచేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu