»   » అన్న హీరో అయితే తమ్ముడు విలన్!

అన్న హీరో అయితే తమ్ముడు విలన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కార్తీ, తమన్నా జంటగా నటించిన తమిళ చిత్రం 'పయ్యా" ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సందర్బంగా ఏర్సాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు అడిగిన ప్రశ్నలకు చాల గమ్మత్తుగా సమాధానం ఇచ్చాడు కార్తీ. అయితే ఓ ప్రశ్నకు మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చాడీ వెరైటీ తమ్ముడు. అతనికి ఎక్కువగా 'పయ్యా" లాంటి మాస్ సిసిమాలంటే ఇష్టమట. ఏ హీరో అయినా మొదట్లో రఫ్ అండ్ టఫ్ సినిమాలను ఎంచుకున్నా తర్వాత చాక్లెట్ యాక్షన్ చెయ్యక తప్పదు. ఇలాంటి సూపర్ మాన్ తప్పకుండా కొద్ద రోజుల తర్వాత 'పరుత్తీవీరన్" మరియు 'ఆయిరాతిల్ ఓరువన్" వంటి చిత్రాలలో నటిస్తాడని ప్రేక్షకుల అభిప్రాయం. అయితే అతను ఎప్పుడు కొత్తదనాన్ని వెరైటి చిత్రాలను ఎంచకుంటానంటున్నాడు. ఒక వేళ సూర్య తో కలసి నటించే అవకాశం వస్తే అన్న ప్రశ్నకు సమధానంగా..

ఇద్దరు అన్నదమ్ములు ఒకే చిత్రంలో నటించాల్సివస్తే రీల్ లైఫ్ లో కూడా అన్నదమ్ములుగా నటించాలనుకుంటారు. కుదరకపోతే తండ్రి కొడుకులుగా అగుపించాలనుకొంటారు. లేదంటే ఫ్రెండ్స్. కానీ తమ్ముడు మాత్రం విలన్ గా నటించాలనుకుంటున్నాడు. అన్న సూర్య హీరోగా నటిస్తే అందులో విలన్ గా నటించడం తన డ్రీమ్ అంటున్నాడు...తమ్ముడు కార్తీ. 'యుగానికి ఒక్కడు" చిత్రం ద్వారా కార్తీ తెలుగువారికి పరిచయమయ్యాడు. కార్తీ ఇంతవరకు నటించినవి మూడు చిత్రాలే అయినా మూడూ దేనికవే డిఫరెంట్ మూవీస్. రెగ్యులర్ హీరోగా కనిపించడం ఆయనకు ఇష్టం ఉండదు. వెరైటి క్యారెక్టర్స్ పోషించాలనుకుంటాడు. అందులో భాగంగానే ఈ విలన్ పాత్ర.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu