»   » దివంగత హాస్య నటుడు నగేష్ మళ్లీ వెండి తెరపై

దివంగత హాస్య నటుడు నగేష్ మళ్లీ వెండి తెరపై

Posted By:
Subscribe to Filmibeat Telugu
Late Nagesh seen with Rajini
చెన్నై : తెరపై రెండు సెకన్లు కనిపించినా గంటల కొద్దీ నవ్వు తెప్పించగల నటుల్లో నగేష్‌ ప్రధముడు. ఆయన స్టార్ హీరోలందరి కాంబినేషన్ లో చేసి నవ్వులు పూయించారు. తమిళ,తెలుగు భాషల్లో ఆయన ప్రసిద్దుడు. ఆయన 2009 లో మరిణించారు. అయితే ఇప్పుడాయన మళ్లీ వెండితెరపై కనిపించి నవ్వించనున్నారు. అదీ రజనీకాంత్ కాంబినేషన్ లో అని తెలుస్తోంది. రజనీకాంత్ తాజా చిత్రం కొచ్చిడియాన్(విక్రమ్ సింహా)లో ఆయన తో కొన్ని సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది.

నాగేష్ కి చెందిన హై రిజల్యూషన్ ఇమేజెస్, ఆయన పోలికలతో ఉండే కొందరి బాడీ మూవ్ మెంట్స్ సహాయంతో ఈ 3డి యానిమేషన్ చిత్రంలో ఆయన్ని రీక్రియేట్ చేసారని తెలుస్తోంది. రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కోచ్చడయాన్‌'. ఆయన కూతురు సౌందర్య ఆర్‌.అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తూ త్రీడీ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఇటీవలే విడుదల చేశారు...మంచి రెస్పాన్స్ వచ్చింది.

నాగేష్ (అసలు ఇదే పేరు) సున్నిత మైన హాస్యాన్ని పండించడంలో దిట్ట. వెకిలి హాస్యం అన్నదే అతనికి తెలీదు. అందుకే అతని పుట్టించిన నవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతూనే ఉంటుంది. తెలుగు సినిమాకి లభించిన సున్నితమైన హాస్య నటుల్లో నాగేష్‌ పేరు చిరస్తాయిగా నిలిచిపోతుంది. . 'బృందావనం' సినిమాలో అతని హాస్యం టైమింగ్‌ అద్భుతంగా ఉంటుంది.

నాగేష్‌తో కామిడీ సీన్లు నటించడం చాలా కష్టం. ఆయన టైమింగ్‌తో మనది కలపడం అంత సులభం కాదంటూ బృందావనం సినిమా విడుదల సందర్భం లో ప్రముఖ హాస్య నటుడు రాజేంద్రప్రసాద్‌ అప్పట్లో చాలా సార్లు చెప్పారు. కమలహాసన్‌ అభిమాన నటుడు నాగేష్‌. ఆయ న్ని ప్రతీ సినిమాలోనూ తీసుకోమని నిర్మాతలకి సిఫార్సు చేసేవాడు. ఇంద్రుడు-చంద్రుడు సినిమాలో రాజకీయ నాయ కుడి పాత్రలో అతన్ని చూస్తే నవ్వాగదు.

తనదంటూ ఒక ప్రత్యేకమైన బాణీలో డెైలాగ్‌ చెప్పేవాడు. ఆ చెప్పడంలోనే మ నకి నవ్వు రప్పించేది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామానా యుడు మొరటోడు అనే సినిమా తీసాడు. దానికి దర్శకుడు నాగేష్‌. ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు. నాగేష్‌ దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా అదొక్కటే. మళ్లీ ఇంతకాలం తర్వాత నాగేష్ తెరపై కనిపించటంతో ఆయన అభిమానులు తప్పక ఆనందపడతారనటంలో సందేహం లేదు.

English summary
Late Tamil actor Nagesh who died in 2009 will soon be seen on the big screen in the Rajinikanth starrer, Kochadaiiyaan. Technology has been known to do many amazing things, especially in the world of cinema. Now it is bringing back late Tamil actor Nagesh to the silver screen. To do that, some high resolution images of Nagesh were scanned to create a 3D model. Actors with some resemblances to Nagesh regarding his body movements were used to capture the motion and movement of Nagesh. And with all that, the film is bound to be remembered for rekindling the spirit of Nagesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu