»   » రజనీకి థాంక్స్: ‘లింగ’ బాధితులకు 10 కోట్ల నష్ట పరిహారం

రజనీకి థాంక్స్: ‘లింగ’ బాధితులకు 10 కోట్ల నష్ట పరిహారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ నటించిన ‘లింగా' చిత్రం పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. తమను ఆదుకోవాలంటూ గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ఆందోళన ఫలించింది. బాధితులకు రూ. 10 కోట్ల నష్ట పరిహారం అందింది. నష్టపరిహారం తిరిగి చెల్లించడానికి సహకరించిన రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు థాంక్స్ చెప్పారు.

‘లింగా' చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు రూ.33 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. నిర్మాత రాక్ లైన్ వెంకటేస్ తొలుత పది శాతం(3 కోట్లు) పరిహారం చెల్లిస్తాని చెప్పారు. దీనికి అంగీకరించని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళ తీవ్ర తరం చేసారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను, దక్షిణ భారతచలన చిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, రజనీకాంత్ సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించే విధంగా నిర్మాతను ఒప్పించారు. తమకు సహకరించిన ఈ ముగ్గురికి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు థాంక్స్ చెప్పారు.


తొలి దశ చర్చల్లో రూ. 33 కోట్లు పరిహారం ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేసారు. అయితే నిర్మాత రూ. 3 కోట్లు ఇస్తానని చెప్పాడు. రెండో దశ చర్చల్లో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతపై రాజకీయ పరమైన ఒత్తిడి తెచ్చి రూ. 24 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అయితే నిర్మాత 7 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోక పోవడంతో చర్చలు విఫలం అయ్యాయి. తాజాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల మధ్య మూడో దఫా చర్చలు జరిగాయి.


Lingaa distributors get Rs. 10 cr.

మూడోసారి చర్చల్లో డిస్ట్రిబ్యూటర్లు కనీసం రూ. 16.5 కోట్లయినా ఇవ్వాలని, లేకుంటే తమ నష్టాలు తీరే అవకాశం లేదని కోరారు. అయితే చివరకు నిర్మాత రూ. 10 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చిన మొత్తాన్ని తీసుకునేందుకు ఒప్పుకున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ..గతంలో రవితేజ తో పవర్ చిత్రం చేసారు. బాబీని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం మంచి హిట్ అయ్యి...లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో ఆ లాభాలు...ఇప్పుడు రజనీ చిత్రం అప్పులు కోసం ఖర్చు పెట్టినట్లైంది అంటున్నారు.


కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ‘లింగా' చిత్రం డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. అనుష్క, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అంచనాలు భారీగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా రేటు పెట్టి కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఈ చిత్రం నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

English summary
Actor Rajinikanth has refunded one-third of the Rs. 33-crore loss reportedly incurred by distributors and exhibitors of his recent release, Lingaa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu