»   » ప్రధాని నోట్ల రద్దు పై మండిపడ్డ సీనియర్ నటుడు,పోరాటానికి పిలుపు

ప్రధాని నోట్ల రద్దు పై మండిపడ్డ సీనియర్ నటుడు,పోరాటానికి పిలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ ప్రజల్ని రాత్రికి రాత్రే బిచ్చగాళ్లను చేశారని నటుడు, దర్శక నిర్మాత మన్సూర్ అలీఖాన్ ధ్వజమెత్తారు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారని అన్నారు. ఇది నల్లధనాన్ని అరికట్టే చర్య అని చాలా మంది అంటున్నారన్నారని నిజానికి ప్రధాని ప్రకటన ప్రజలను రాత్రికి రాత్రే బిచ్చగాళ్లను చేసిందని ధ్వజమెత్తారు.

ఆర్థిక సమస్యలతో చిత్ర పరిశ్రమ అతలాకుతలం అవుతోందన్నారు.ప్రజలు చిల్లర డబ్బులు లేక వీధిన పడ్డారని పేర్కొన్నారు.
మైమోసా పతాకంపై సీకేపీఆర్.మోహన్ నిర్మించిన చిత్రం కొంచెం కొంచెం. నవ తారలు గోకుల్, నీనూ, ప్రియా మోహన్ హీరో, హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఉదయ్‌శేఖర్ దర్శకత్వం వహించారు.

వల్లవన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం చెన్నై లోని సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ ఇలా స్పందించారు. ఆయన ఏమన్నారో క్రింద చూడండి.


మన్సూర్ అలీ ఖాన్ కంటిన్యూ చేస్తూ...ఇక ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం లేదన్నారు.నిత్యావసర ఖర్చులకు కూడా డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారని, డబ్బును మార్చుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు పడుతున్నారని అన్నారు.దీంతో గత ఐదు రోజులుగా థియేటర్లు జనాలు లేక మూత పడే పరిస్థితి నెలకొందన్నారు.

చిత్రపరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటోందన్నారు.ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. సినీ కళాకారులందరూ పోరాటం చేయాలని మన్సూర్ అలీఖాన్ ఉద్వేగంగా మాట్లాడారు.


కాగా తానీ రోజు ఒక చిత్ర షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందని,అయితే కళాకారులకు, కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉండడంతో నిర్మాతలు డబ్బును మార్చడానికి బ్యాంకుకు వెళ్లడంతో షూటింగ్‌ను ఒక పూట రద్దు చేశారని తెలిపారు.


అలాగే.. మలయాళ నిర్మాతలు నిర్మించిన చిత్రం ఇదన్నారు.మన కళాకారులు తెలుగు చిత్ర పరిశ్రమలో విజయం సాధిస్తునట్లుగానే వీరు ఇక్కడ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. తాను ఈ చిత్రంలో నటించానని, ఇది చాలా మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు ఎస్‌పీ.ముత్తురామన్, శీనూరామసామి సుశీందర్, జాగ్వర్ తంగం పాల్గొన్నారు.

English summary
Mansoor ali khan angry speech press meet about modi's action against black money holders. mansoor ali khan says many people are affected from this currecy ban modi has to pay for this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu