»   » ముమైత్ ఖాన్ బుస కొట్టడం అంతబాగా నచ్చిందా?

ముమైత్ ఖాన్ బుస కొట్టడం అంతబాగా నచ్చిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో హిట్టియిన చిత్రాలు తమిళంలోకి రీమేక్ అవటం పెద్ద విచిత్రమేమీ కాదు. అయితే తెలుగులో ప్లాప్ అయిన పున్నమినాగు చిత్రాన్ని మళ్ళీ ముమైత్ తోనే తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. కన్నన్ అనే దర్శకుడు ఈ రీమేక్ ని అతి జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఆ పాత్రలో వేరే వారిని ఊహించుకోలేమని చెప్తూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. దాంతో అతనికి ముమైత్ బుస కొట్టడం బాగా నచ్చి ఉంటుంది అందుకే అలా చేస్తున్నారు అని కామెంట్స్ తెలుగు పరిశ్రమలో వినపిస్తోంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...ఈ కథ నాగ దేవతలకు సంభందించింది. శివుడు ఎదురుగా నృత్యం చేయటానికి నాగ లోకం నుంచి వచ్చిన నాగ జంటలో మగది మరణిస్తుంది. మణి కోసం కొందరు దాన్ని చంపేస్తారు. అప్పుడు మిగలిన ఆడ నాగు పగపట్టి తన పోలికలతోనే ఉన్న ఓ ఆల్ట్రా మోడ్రన్ అమ్మాయిలో ప్రవేశించి ఆ విలన్స్ ని సంహరిస్తుంది. గ్రాఫిక్స్ తో, కనువిందు చేసే డాన్స్ లతో ఈ చిత్రం అలరిస్తుంది. ఎస్.ఎ.రాజకుమార్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది అంటున్నాడు. చూద్దాం అతనేమన్నా ఈ చిత్రం కొత్తగా రూపొందించి హిట్టు కొడతాడామో.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu