మంచంపై వణికిన నమిత
లేటెస్ట్ గా నమిత తాను నటించిన ఓ చిత్రం ప్రమోషన్ కార్యక్రమానికి అటెండ్ కాకపోవటంతో ఆ చిత్రం నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేసారు. దాంతో ఆ కోలీవుడ్ నడిగర్ సంఘం వారు ఆమెకు నోటీస్ పంపటం జరిగింది. ఇరవై నాలుగు గంటల లోపల సంజాయిషీ ఇచ్చికోవల్సిందేనని లేకపోతే క్రమశిక్షణ రాహిత్యంగా భావిస్తూ తదుపరి చర్యకు వెళ్ళతామని బెదిరించింది. అది చూసిన నమిత మండిపడుతోంది. తామూ మనుషులమేనని గుర్తించాలని నిష్టూరాలాడుతోంది. ఆ నోటీస్ కి తాను బదులిచ్చేది లేదని చెప్తోంది. అసలు సంగతి ఏమిటని ఆమెను మీడియావారు ప్రశ్నించగా నేను గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాను. వారు ప్రమోషన్ కి పిలిచిన సమయంలో నేను బెడ్ పై లేవలేని స్ధితిలో ఉన్నాను. నేను దుప్పటి తీసి లేచేసరికి నా శరీరం మొత్తం వణికింది. ఇది చూసిన మా డాక్టర్ మాట కన్నా ప్రాణం ముఖ్యమని సర్ధి చెప్పి నన్ను ఆపు చేసారు. అటు వంటి కండిషన్లో ఎవరూ ఎక్కడకు వెళ్ళలేరు..ఇందులో నా తప్పేమైనా ఉందా అని నిలదీస్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











