»   » ఏడాది పాటు నయనతార కాల్షీట్స్ ఉండవా?

ఏడాది పాటు నయనతార కాల్షీట్స్ ఉండవా?

Subscribe to Filmibeat Telugu

నయనతార ఒక ఏడాది పాటు సినిమాల్లో నటించదా? తమిళ సినిమా రంగంలో ఆదే మాట విన్పిస్తోంది. ఆమె తాజాగా నటించిన తెలుగు సినిమా "అదుర్స్" కలెక్షన్స్ అదురుతున్నా ఆమె ఒక సంవత్సరం పాటు సినిమాలకు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నదో అర్ధం కావడం లేదు. గత రెండేళ్ళుగా ఆమెకు పెద్ద హిట్స్ లేవు. తాజా చిత్రం అదుర్స్ హిట్ అయినా అందులో ఆమె పాత్ర నామమాత్రమే.

నాన్ వెజ్ బాగా తినే నయనతార ఆ మధ్య బాగా లావెక్కింది. ఆ తర్వాత కేరళ వెళ్ళి ఆయుర్వేద వైద్యం ద్వారా వళ్ళు తగ్గించుకుంది. ఆమె నటించిన మలయాళం సినిమా నిన్న విడుదలైంది. ఇప్పుడు తమిళ సినిమాల్లో ఆమెకు పెద్ద డిమాండ్ లేదు. కేరళలోని సొంత ఊరికి వెళ్ళి ఆమె ఆయుర్వేద చికిత్సతో చర్మం మెరుపులు మెరిసేలా చూసుకోవాలనుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu