»   » అంత దిగజారలేదంటూ నమిత

అంత దిగజారలేదంటూ నమిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆఫర్స్ సరిగ్గా లేక అవస్ధలు పడుతున్న నమిత వద్దకు సి గ్రేడ్ నిర్మాతలు వస్తున్నారు.రీసెంట్ గా ఓ మళయాళ నిర్మాత కలిసి ఓ సెక్స్ సినిమా చేద్దాం అని ప్రపోజల్ పెట్టాడు.అంతేగాక ఆమెకు ఒకేసారి అరవై లక్షలు రూపాయలు వరకూ ఇస్తానని బేరం పెట్టాడు.అయితే నమిత ఈ ప్రాజెక్టు చేయనని ఖరాఖండిగా చెప్పేసింది.ఆ విషయం ఆమె మాట్లాడుతూ..నేను డబ్బుకోసం సంపాదన మొదలెడితే ఈ పాటికి తనకు అంతులేని సంపద ఉండేది. నేను అటువంటి టైపు కాదు...షకీలాలా ఆ టైప్ సినిమాలలో నటించాల్సిన అవసరం లేదు అని తెగేసి చెప్పింది.సింహా తర్వాత నమిత తెలుగులో ఏ సినమా ఆఫరూ రాలేదు.ఆమె ప్రధాన పాత్రలో ప్రారంభమైన దేశద్రోహి చిత్రం ఆగిపోయింది.ప్రస్తుతం ఆమె కన్నడంలో 'నమిత ఐ లవ్‌యూ.."అనే చిత్రం చేస్తోంది.ఆ చిత్రంలో ఆమె యోగా టీచర్ గా కనిపించనుంది.

English summary
Namitha plays a Yoga teacher in Namitha I Love You film.Namitha says that the film has an action oriented story and meets with her desire to experiment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu