పిల్లల చిత్రం 'పసంగ' కి మూడు నేషనల్ అవార్డులు

By Srikanya

57వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తమిళ చిత్ర పరిశ్రమకి మూడు అవార్డులు, ఒక ప్రశంసా పత్రం లభించా యి. ఉత్తమ చిత్రంగా 'పసంగ' అవార్డును అందు కుంది. ఉత్తమ బాలనటులు, ఉత్తమ మాటల రచయి త అవార్డులతో పాటు ప్రత్యేక ప్రశంసా పత్రం కూడా కోలీవుడ్‌కు దక్కింది. చిన్న పిల్లల నేపథ్యంతో నూత న దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన 'పసంగ' చిత్రానికే ఈ మూడు అవార్డులు రావడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'పసంగ' జాతీయ అవార్డు సాధించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నట దర్శకుడు శశికుమార్ నిర్మించారు. ఇందుకు గాను ఆయనకు అవార్డుతో పాటు రూ.లక్ష నగదు, రజత పతకం బహూకరించనున్నారు. అదే చిత్రంలో నటించిన జీవా, అన్బక్కరసు ఉత్తమ బాలనటులుగా, పాండిరాజ్ ఉత్తమ డైలాగ్ రైటర్‌గా ఎంపికయ్యారు. ఇందుకుగాను వారికి రూ.50 వేలు నగదు, రజత పతకం కూడా బహూకరించనున్నారు.

అవార్డులు వచ్చిన సందర్భంగా పసంగ చిత్ర నిర్మాత శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ అవార్డును సినీ పరిశ్రమకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మాటల రచయితగా పాండ్యరాజ్‌కు అవార్డు రావడం చాలా సంతోషంగా వుందన్నారు. ఆయన చెప్పినదానికన్నా సినిమాను అద్భుతంగా చిత్రీకరించారన్నారు. పిల్లలు కూడా తమ శక్తికి మించి చక్కగా నటించారన్నారు. అనంతరం దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ పసంగ చిత్రానికి టెక్నీషియన్ల సహకారం ఎంతో వుందన్నారు. వారి సహకారం లేకపోతే సినిమా అంత బాగా వచ్చేది కాదన్నారు. తాను చెప్పిన కథ విని సినిమా నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రారని భావించానని, కానీ శశికుమార్ ముందుకొచ్చారని తెలిపారు. ఇక శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం తెలుగులో అనంతపురంగా రిలీజైంది. అలాగే శశికుమార్ నిర్మిస్తూ నటించిన నాడోడిగల్ చిత్రం తెలుగులో శంభో శివ శంభో చిత్రంగా రీమేక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X