For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మనసు మార్చుకోమంటూ రజనీకాంత్ కి రిక్వెస్టులు

  By Srikanya
  |
  చెన్నై : రజనీకాంత్ ఏం చేసినా సంచలనమే. ఆయన నిర్ణయాలను అబిమానులను ఎప్పుడూ జవదాటరు. అయితే రజనీకూడా తన అభిమానుల మాటలను కాదనరు. అభిమానలకే ఆయనకు ప్రాణం అన్నట్లుగా జీవిస్తూంటారు. తాజాగా... ఆయన ఫ్యాన్స్ .. 'తలైవా (నాయకుడా) మనసు మార్చుకో.. త్యాగం చేసింది చాలు.. ఇకనైనా అసెంబ్లీ వైపు దృష్టి పెట్టు.. అడుగు పెట్టు' అంటూ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి రాతలతో కూడిన పోస్టర్లు చెన్నై నగరంలో ఎటుచూసినా కనిపిస్తున్నారుు.

  దాంతో ఈ పోస్టర్లు ఎలాంటి రాజకీయ పరిస్థితులకు సంకేతం అన్న ప్రశ్న అన్ని చోట్లా బయలుదేరింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తమిళనాడులోని ఆయన అభిమానుల గురించి చెప్పనవసరం లేదు. తమ హీరో రాజకీయూల్లోకి రావాలని వారు చాలా కాలంగా కోరుతున్నారు. రెండేళ్ల క్రితం ఏకంగా ఆందోళనలకు దిగారు. రజనీకాంత్ పేరిట పార్టీని, పార్టీ జెండాను ప్రకటించేశారు.

  గతంలో రజనీ ఈ విషయమై స్పందించారు. అభిమాన సంఘాల నేతల్ని చెన్నైకి పిలిపించుకుని మరీ బుజ్జగించారు. 'దేవుడు శాసిస్తే...రాజకీయాల్లోకి వస్తా' అంటూ మెలిక పెట్టారు. ఇటీవల ఓ సభలో రజనీకాంత్ భార్య లత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన(రజనీ) రాజకీయాల్లోకి వెళ్లొద్దని తాను చెప్పనని, అది ఆయన అభీష్టానికే వదలిపెట్టానని వ్యాఖ్యానించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

  రజనీకాంత్ నివాసం ఉండే పోయెస్ గార్డెన్, కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపం పరిసరాలు, నగరంలోని ప్రధాన మార్గాల్లో సోమవారం పోస్టర్లు వెలిశారుు. పలు రకాల స్టైల్స్‌తో రజనీ చిత్రాల్ని, అసెంబ్లీ ముఖచిత్రం, తమిళనాడు మ్యాప్‌లను పొందుపరిచారు. అసెంబ్లీ ముందు రజనీ నడుస్తున్నట్లు చూపి 'విట్టు కొడుత్తదు పోదుం..తలైవా! ఉళ్లే పో...' ( త్యాగం చేసింది చాలు ..నాయకుడా..లోనికి వెళ్లు) అన్న నినాదాన్ని ముద్రించడం విశేషం.

  అలాగే 'మామణిదా.. మనం మారు..ఉన్ తలమైక్కాగ ఏంగిగిరేన్..ఇప్పడిక్కి తమిళనా డు..' ( మహా మనిషి మనసు మార్చుకో నీ అధ్యక్షత కోసం ఎదురు చూస్తున్నా ఇట్లు తమిళనాడు) అంటూ తమిళనాడు మ్యాప్‌తో రజనీకాంత్ ఫొటోల్ని ముద్రించారు. తాటికాయంత అక్షరాలతో తమ పేర్లను, ఫొటోలను అభిమానులు ఏర్పాటు చేయడం విశేషం. ఈ పోస్టర్లను జనం ఆసక్తిగా గమనిస్తున్నారు.

  English summary
  Upset over the continued silence of super star Rajinikanth over his entry into politics, some of his fans in Coimbatore have came out with posters urging him to aspire for the top seat of power in the state, the chief minister's mantle, in the next assembly elections. Posters were installed at Lanka Corner near Coimbatore railway junction in the city on Friday. While one poster urges him to enter the secretariat and just wait, another says that Tamil Nadu is awaiting his leadership. Most passersby stopped to take a closer look at the posters. The intelligence wing of the city police immediately took pictures of the colorful installations and sent them to headquarters in Chennai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X